శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2019
Written By
Last Updated : బుధవారం, 8 మే 2019 (19:01 IST)

కోహ్లీని ''వుడెన్ స్పూన్‌'' అంటూ వెక్కిరించిన విజయ్ మాల్యా (video)

ఆర్సీబీ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని వుడెన్ స్పూన్ అంటూ లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా సెటైర్లు వేశాడు. ఐపీఎల్‌లో ఆర్సీబీకి విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై మాల్యా అసంతృప్తి వ్యక్తం చేశాడు.


ఈ ఏడాది ఐపీఎల్ 12వ సీజన్‌లో బెంగళూరు జట్టు పేలవమైన ప్రదర్శనను కనబరిచింది. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో కోహ్లీసేన చివరి స్థానంలో అతుక్కుపోయింది. 
 
దీనిపై విరాట్ కోహ్లీ వివరణ కూడా ఇచ్చాడు. ఇందులో చివరిగా జరిగిన ఏడు మ్యాచ్‌ల్లో ఐదు పోటీల్లో గెలిచామని సరిపెట్టుకున్నాడు. దీనిపై మాల్యా స్పందిస్తూ.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. 
 
''పెద్ద లయన్ ఆఫ్ అనేది కాగితంలో మాత్రమే.. వుడెన్ స్పూన్ ప్రైజ్‌తో ఆవేదన చెందాను..'' అని కోహ్లీపై అసంతృప్తిని మాల్యా వెల్లగక్కాడు. వుడెన్ స్పూన్ అనేది.. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచే జట్టుకు ఇచ్చేది కావడం గమనార్హం.