కోహ్లీకి అరుదైన గౌరవం.. వరుసగా మూడోసారి విస్డన్‌లో చోటు..

Last Updated: గురువారం, 11 ఏప్రియల్ 2019 (12:17 IST)
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. విరాట్ కోహ్లీని వరుసగా మూడోసారి విస్డన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటించడం జరిగింది. ఇంకా ప్రపంచంలోనే లీడింగ్ క్రికెటర్‌గానూ కోహ్లీని ప్రకటిస్తూ విస్డన్ పత్రిక గౌరవించింది. ప్రతి ఏడాది ప్రపంచంలో అత్యుత్తమ క్రికెటర్ల జాబితాను విడుదల చేసే ఇంగ్లండ్ మాస పత్రిక విస్డన్.. ఈ ఏడాది విరాట్ కోహ్లీని ప్రపంచంలో అత్యుత్తమ క్రికెటర్ల జాబితాలో టాప్-5లో స్థానం కల్పించింది. 
 
గత ఏడాది ఐసీసీకి చెందిన టెస్టు, వన్డేల్లో అత్యుత్తమ క్రికెటర్ అవార్డులను గెలుచుకున్న కోహ్లీ, 2018లో అన్నీ ఫార్మాట్‌లలో 11 శతకాలు సాధించాడు. దీంతో 2, 735 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో విస్డన్ జాబితాలో కోహ్లీ స్థానం సంపాదించుకున్నాడు. ఇంగ్లండ్‌కు చెందిన జాస్ బట్లర్, శామ్ కుర్రాన్, రోరీ ఫర్న్స్, ఇంగ్లండ్ మహిళా జట్టు డేమీలు ఈ జాబితాలో స్థానం దక్కించుకున్నారు. 
 
దీనిపై విస్డన్ ఎడిటర్ లారెన్స్ మాట్లాడుతూ.. 2014లో మాత్రం కాస్త తడబడిన కోహ్లీ.. అటుపిమ్మట టెస్టు, వన్డే ఫార్మాట్‌లలో తన సత్తా ఏంటో నిరూపించుకుంటున్నాడని కొనియాడారు. ఇదేవిధంగా విస్డన్ జాబితాలో భారత మహిళా క్రికెటర్ స్మృతి మందనకు కూడా చోటు దక్కింది.దీనిపై మరింత చదవండి :