గురువారం, 28 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2019
Written By
Last Updated : మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (13:00 IST)

ఐపీఎల్ నుంచి కోహ్లీ రిటైర్మెంట్.. గంభీర్ వ్యాఖ్యలతో ఆ నిర్ణయం?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్‌ మార్చి 23వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఐపీఎల్ ఆరంభ పోటీ చెన్నై సూపర్ కింగ్స్, బెంగళూరు రాయల్స్ మధ్య చేపాక్ మైదానంలో జరిగింది. ఈ జట్లకు టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ, ప్రస్తుత కెప్టెన్ కోహ్లీ సారథ్యం వహించారు. ఈ పోటీలో కోహ్లీ సేన పరాజయం పాలైంది. ఆపై జరిగిన మ్యాచ్‌ల్లోనూ రాయల్ ఛాలెంజర్స్ పరాజయాలనే మూటగట్టుకుంటోంది. 
 
14 మ్యాచ్‌లతో కూడిన లీగ్ దశలో ఇదివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఓటమి పాలైంది. మిగిలిన 8 మ్యాచ్‌ల్లో గెలిస్తే మాత్రమే క్వాలిఫైయింగ్ రౌండ్‌కు రాయల్ ఛాలెంజర్స్ అడుగుపెట్టే అవకాశం వుంటుంది. లేకుంటే ఐపీఎల్ నుంచి నిష్క్రమించే పరిస్థితికి కోహ్లీ జట్టు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో కోహ్లీపై ఇంగ్లండ్ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ వాగన్ మాట్లాడుతూ.. భారత జట్టు ఓ కచ్చిత నిర్ణయం తీసుకోకుండా.. విరాట్ కోహ్లీని ఐపీఎల్‌లో ఆడనిస్తోంది. కోహ్లీకి ఐపీఎల్‌ నుంచి రిటైర్మెంట్ ఇవ్వాలని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రపంచ కప్ రానుండటంతో కోహ్లీ విశ్రాంతి అవసరమని చెప్పుకొచ్చాడు. 
 
మరోవైపు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కూడా విమర్శలు గుప్పించాడు. ఐపీఎల్ తాజా సీజన్ లో కోహ్లీ నాయకత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుసగా ఆరు మ్యాచ్‌లలో ఓటమిపాలవడంతో గంభీర్ ఫైర్ అయ్యాడు.

ఇంతవరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలిపించకపోయినా ఇన్నేళ్లపాటు బెంగళూరు జట్టుకు కోహ్లీని కెప్టెన్‌గా కొనసాగించడం చాలా గొప్ప విషయం అంటూ ఎద్దేవా చేశాడు. కోహ్లీ మంచి బ్యాట్స్‌మన్ మాత్రమేనని, కెప్టెన్సీ విషయంలో ఓ సహాయకుడు మాత్రమేనని అన్నాడు. 
 
భారత జట్టుకు కెప్టెన్‌గా వుండి కూడా ఐపీఎల్‌లో ఒక్కసారి కూడా టైటిల్ గెలవని వ్యక్తి కోహ్లీ మాత్రమేనని విమర్శించాడు. కోహ్లీ కంటే రోహిత్ శర్మ నయం అని, వైస్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ ముంబయిని రెండుసార్లు ఐపీఎల్ చాంపియన్‌గా నిలిపాడని గుర్తుచేశాడు. 


ఇప్పటికే కోహ్లీ, గంభీర్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. తాజా కామెంట్లతో కోహ్లీ కూడా గంభీర్‌కు ఇంట్లో కూర్చుంటామని చురక వేశాడు. మరి కోహ్లీ ఐపీఎల్‌ నుంచి తప్పుకుంటాడా.. లేకుంటే ఇలాంటి విమర్శలకు ధీటుగా బదులిచ్చే రీతిలో బెంగళూరు జట్టును గెలిపిస్తాడా అనేది తెలియాలంటే.. వేచి చూడాల్సిందే.