ముత్యాల చెమ్మచెక్క... రత్నాల చెమ్మచెక్క, కోహ్లిపై పేలుతున్న ట్రోల్స్(Video)

Siraj
Last Updated: సోమవారం, 8 ఏప్రియల్ 2019 (15:47 IST)
ఐపీఎల్ 2019 పోటీల్లో భాగంగా ఆదివారం నాడు జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి సారథ్యం వహిస్తున్న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఎప్పటిలాగే అలవాటుగా పరాజయాన్ని చవిచూసింది. బెంగుళూరు జట్టు నిర్దేశించిన 149 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ 18.5 ఓవర్లలో 6 వికెట్లకు 152 పరుగులు చేసి కోహ్లి ఆశలపై నీళ్లు చల్లింది.

ఆర్బీసీ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 149 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ రాణించినప్పటికీ విజయాన్ని అందుకోలేక పోయారు. ఆ జట్టులో పార్థివ్‌పటేల్ 9, కోహ్లీ 41, డివిలీయర్స్ 17, స్టోయినిస్ 15, అలీ 32, నాథ్ 19, నేగి 0, సౌథి 9 నాటౌట్, సిరాజ్ 1, చాహల్ 1 నాటౌట్ చొప్పున పరుగులు చేయగా, అదనపు పరుగులు రూపంలో 5 రన్స్ వచ్చాయి. దీంతో 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది.

ఇప్పుడు కోహ్లి సారథ్యం వహిస్తున్న బెంగళూరు వరుస పరాజయాలు పాలవుతుండటంతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ముత్యాల చమ్మచెక్క... రత్నాల చమ్మచెక్క... అంటూ సాగే పాటకు కోహ్లి కదలికలను జోడిస్తూ పోస్ట్ చేసిన వీడియో... మీరూ చూడండి.దీనిపై మరింత చదవండి :