మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By మోహన్
Last Updated : మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (10:07 IST)

నేటితో ఎన్నికల ప్రచార యుద్ధానికి తెర... ఆ తర్వాత తాయిలాలతో ఎర

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు రసవత్తరంగా జరగనున్నాయి. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాలను హోరెత్తిస్తున్నాయి. పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలు విడుదలతో పొలిటికల్ వేడి మరింత పెరిగింది. ఇదిలావుంటే ఈనెల 11వ తేదీ గురువారం ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు అన్ని ప్రచార మైకులు మూగబోనున్నాయి. అంటే ప్రచార యుద్ధానికి తెరపడనుంది. 
 
ఇప్పటివరకు బాకా ఊది ప్రసంగించిన నేతలంతా మంగళవారం సాయంత్రం నుండి విశ్రాంతి తీసుకోనున్నారు. అలాగే సమస్యాత్మక పోలింగ్ స్టేషన్‌ల వద్ద రేపటి నుండే 144 సెక్షన్ అమలులోకి వస్తుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. 
 
కాగా ప్రచారం చివరి దశకు చేరుకునే సరికి అన్ని పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ, వారిని తమవైపునకు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఎన్నికకు రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో నేతలు వీలైనంత వరకు ఓటర్లను ఆకట్టుకునే ప్రసంగాలు చేస్తున్నారు. 
 
అలాగే ఓటర్లు తమకు నచ్చిన వారిని ఎన్నుకోవడానికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ ఇప్పటికే ప్రముఖులు పెద్ద ఎత్తున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరుగనుండగా, మే 23వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి.