సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : సోమవారం, 8 ఏప్రియల్ 2019 (16:48 IST)

నా పొలిటికల్ కెరీర్ కంటే.. నీ సినీ కెరీర్ ముఖ్యం... చెర్రీకి బాబాయ్ హితవు

ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ నేత పవన్ ప్రచారం చేస్తున్నా కుటుంబ సభ్యులు ఎవ్వరూ అండగా నిలవడం లేదని అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. చరణ్ బాబాయ్‌కి అండగా ఉంటానని చెప్పి చివరకి రామ్ చరణ్ కూడా ముఖం చాటేశాడని ఫ్యాన్స్ ఏకిపారేస్తున్నారు. దాంతో చరణ్ మౌనం వీడాడు. పార్టీకి మద్దతు తెలిపాడు. పవన్‌కి బాగాలేదని తెలిసి కాలు ఫ్రాక్చర్‌ అయి ఉన్నా విజయవాడకు స్వయంగా వెళ్లాడు. 
 
జనసేన కార్యాలయంలో చరణ్ దిగిన ఫోటోలు చూసి ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. చరణ్ పార్టీ తరపున ప్రచారం చేస్తాడని భావించారు. వాస్తవానికి చరణ్ ఆ ఉద్దేశంతోనే వెళ్లాడట. పార్టీ ప్రచారంలో పాల్గొంటానని చెప్పాడట. కానీ పవన్ చరణ్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇందుకు నిరాకరించాడు. రాజకీయాలు వద్దని చెప్పాడు. 
 
రాజకీయాల్లోకి వస్తే సినిమా కెరియర్‌పై ప్రభావం పడుతుందని, తనపై ఒక పార్టీకి చెందిన వాడనే ముద్ర పడుతుందని, అభిమానులు అన్ని పార్టీల్లోనూ వుంటారు కనుక వారి మనోభావాలు దెబ్బ తీయవద్దని పవన్‌ వారించాడట. కానీ చివరి రోజైనా చరణ్ జనసేన తరపున పబ్లిక్‌లో అడ్రెస్ చేస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు.