గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 6 ఏప్రియల్ 2019 (17:49 IST)

నాన్నగారు కష్టపడుతుంటే కన్నీళ్లొస్తున్నాయి.. అకీరా నందన్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ తన తండ్రి గురించి స్పందించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. ఓ అభిమాని చేసిన పనికి కిందపడిపోయిన పవన్ త్వరగా కోలుకోవాలని ఆయన ఫ్యాన్సంతా కోరుకుంటున్న వేళ.. పవర్ స్టార్ కుమారుడు అకీరా తండ్రి ఆరోగ్యంపై ఆవేదన వ్యక్తం చేశాడు. 
 
ఇప్పటికే పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో మెగా బ్రదర్ నాగబాబు, కుమార్తె నిహారిక పాల్గొన్నారు. నిహారికకు తోడుగా నాగబాబు పోటీ చేస్తున్న నరసాపురంలో హీరో వరుణ్ తేజ్ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్‌కు కుమారుడు అకీరా నందన్ నుంచి మద్దతు లభించింది. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్‌లో పవన్ కుమారుడు అకీరానందన్ స్పందించారు.  
 
గత కొద్ది రోజులుగా సరైన నిద్రలేకున్నా.. వడదెబ్బ కారణంగా అస్వస్థతకు గురైనా తెనాలి సభకు పవన్ కల్యాణ్ గారు సిద్ధమవుతున్నారు. ''నాన్నగారు కష్టపడుతున్న తీరు చూస్తుంటే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. ఓ వ్యక్తి ఎంతమేరకు కష్టపడాలో అంతమేరకు కష్టపడుతున్నారు. సర్వస్వం ధారపోస్తున్నారు'' అని తండ్రిని ప్రశంసించారు. అంతకుముందు నాగబాబుకు తన మద్దతు వుంటుందని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ట్విట్టర్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే.