మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By మోహన్
Last Updated : శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (19:24 IST)

ఓ నా దేవుడా? అంటూ కాళ్లు పట్టుకున్నాడు... పడిపోయిన పవన్(video)

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈరోజు విజయనగరం జిల్లాలో ప్రచారం నిర్వహించాడు. వేల సంఖ్యలో అభిమానులు ఆ సభకు హాజరయ్యారు. అయితే అభిమానులు అత్యుత్సాహం కారణంగా పవన్ కళ్యాణ్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ సభకు హాజరైన పవన్ కళ్యాణ్ ప్రసంగించేందుకు సిద్ధమయ్యారు. 
 

ఇంతలో పవన్‌ని కలవాలని ఓ అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. పవన్ వెనుక నుంచి వచ్చిన అతను దూకుడుగా రావడంతో పవన్ ఒక్కసారిగా కిందపడిపోయారు.
 
ఆ వ్యక్తి పవన్‌కు పాదాభివందనం చేసే క్రమంలో వెనుక నుంచి కాళ్లను గట్టిగా పట్టుకోవడంతో పవన్ బ్యాలన్స్ కోల్పోయారు. దీంతో ఒక్కసారిగా కిందపడిపోయారు.

ఈ ఘటనతో పవన్ గందరగోళానికి లోనయ్యారు. మైక్ కూడా విరిగిపోయింది. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది అందుకు కారణమైన సదరు అభిమానిని వెనక్కి లాగేశారు. ఆ తర్వాత పవన్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. చూడండి వీడియో...