శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By మోహన్
Last Updated : శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (19:15 IST)

చంద్రబాబు, జగన్‌పై నిప్పులు చెరిగిన పవన్ కళ్యాణ్...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తర్వాతి వారం జరగనున్న ఎన్నికలు వాడి వేడిగా ఉన్నాయి. నేతలు తన పార్టీల అభ్యర్థుల గెలుపునకు సర్వశక్తులను ఒడ్డుతున్నారు. జిల్లాల వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇందులో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. నేడు విజయనగరం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన జనసేనాని చంద్రబాబు, జగన్‌పై నిప్పులు చెరిగారు. 
 
అలాగే విజయనగరం జిల్లాలో కుటుంబ పాలనను తిరిమికొట్టాలని పిలుపునిచ్చిన పవన్ కల్యాణ్ అవినీతి కోటలను బద్దలు కొడతామన్నారు. చంద్రబాబుకి మూడు నెలల ముందే అన్నీ గుర్తొచ్చాయా అంటూ ప్రశ్నించాడు. 
 
అదే విధంగా వైసీపీ అధికారంలోకి వస్తే అరాచకాలు పెరిగిపోతాయంటూ విమర్శించారు. అసలు వైసీపీ తెలంగాణలో ఎందుకు పోటీ చేయడం లేదని, అందుకు సమాధానం చెప్పాలని అన్నారు. చంద్రబాబు, జగన్‌కి తమ తమ కుటుంబాలే ముఖ్యమని, ఆ తర్వాతే ప్రజలు అని కానీ తనకు మాత్రం ప్రజలు తర్వాతే ఎవరైనా అంటూ ఉద్ఘాటించారు.