శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By మోహన్
Last Updated : శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (18:05 IST)

పీక కోస్తా.. నా కొడుకా.. ఏసిపడదొబ్బుతా.. బాలయ్య ఫైర్

నందమూరి బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం నుండి రెండోసారి అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిగా నిలిచిన సంగతి తెలిసిందే..అయితే సినిమాల్లో కొట్టాల్సిన డైలాగ్‌లు తన ప్రచారంలో పలుకుతూ నోరు పారేసుకుంటున్నారు. హిందూపురంలో వేలు, లక్షలు మెజారిటీ అంటూ తప్పుదోవ పట్టిస్తున్నారు. 
 
ఓ తెలుగుదేశం కార్యకర్తను ఉద్దేశించి అరే నీ పేరు, అడ్రస్ చెప్పరా.. గెలువకపోతే నీ సంగతి చెప్తా.. పీక కోస్తా.. నా కొడుకా.. ఏసిపడదొబ్బుతా.. అంటూ తిట్లపురాణం అందుకున్నాడు. సొంతపార్టీ కార్యకర్తలపై నోరు పారేసుకున్నారు.
 
అనంతపురం జిల్లా హిందూపురంలో బాలకృష్ణ తన భార్య వసుంధరతో కలిసి గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ కార్యకర్త ఈసారి 60 వేల మెజారిటీతో గెలుస్తావ్ అంటూ బిగ్గరగా అనడంతో ఆగ్రహించిన బాలకృష్ణ.. గెలువకపోతే నీ సంగతి చూస్తానంటూ కార్యకర్తపై ఫైర్ అయ్యారు.