శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By శ్రీ
Last Modified: గురువారం, 28 మార్చి 2019 (17:02 IST)

అడ్డంగా బుక్కైన బాల‌కృష్ణ‌..!

నంద‌మూరి బాల‌కృష్ణ హిందూపురంలో ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తున్నారు. అయితే... బాల‌య్య నోరు తెరిస్తే.. ఏం మాట్లాడ‌తారో అంద‌రికీ తెలిసిందే. బాల‌య్య ప్ర‌చారం చేస్తున్న టైమ్‌లో ఓ ఛానల్ కెమెరామెన్ క‌వ‌రేజ్ చేస్తుంటే... ఎందుకు షూట్ చేసావ్. దానిని డిలేట్ చేయ్ అంటూ కెమెరామెన్ పైన మండిప‌డ్డాడు. అంత‌టితో ఆగ‌కుండా... మా బ‌తుకులు మీ చేతుల్లో ఉన్నాయరా.. బాంబులు వేయ‌డం వ‌చ్చు. క‌త్తులు తిప్ప‌డం కూడా వ‌చ్చు అంటూ బెదిరించాడు.
 
అంతేనా.. తాట తీస్తా.. అంటూ బూతు పురాణం మొద‌లుపెట్టాడు. సోష‌ల్ మీడియాలో బాల‌య్య బూతు పురాణంపై వైసీపీ నాయ‌కులు, మ‌హిళ‌లు, జ‌ర్న‌లిస్టులు మండిప‌డుతున్నారు. స‌ద‌రు ఛాన‌ల్ వాళ్లు బాల‌య్య క్ష‌మాప‌ణ చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నారు. మ‌రి...బాల‌య్య ఎలా స్పందిస్తాడో చూడాలి.