శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 22 మార్చి 2019 (15:00 IST)

మరో బెంగుళూరు చేస్తానంటున్న స్టార్ హీరో

హిందూపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సినీ నటుడు బాలకృష్ణ మరోసారి పోటీచేయనున్నారు. ఇందుకోసం ఆయన శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ పత్రాల దాఖలుకు ముందు ఆయన సుగూరు ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేయనున్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల నుంచి తెలుగుదేశం పుట్టిందని, అయితే రాష్ట్రంలో కొన్ని దుష్టశక్తులు పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. 
 
ఎవరు ఎంత తప్పుడు ప్రచారం చేసినా కూడా రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 150 సీట్లకు పైగా గెలుపొంది విజయం సాధిస్తుందంని ఆయన జోస్యం చెప్పారు. 
 
అంతేకాకుండా, తాను ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గాన్ని గత ఐదేళ్ళలో అభివృద్ధి పథంలో నడిపానని చెప్పారు. ఈ దఫా మరోమారు విజయం సాధించి హిందూపురంను బెంగుళూరు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.