నారా లోకేష్ మళ్లీ జారారు... వైసీపి ఉపయోగించుకుంటోంది...

nara lokesh
Last Modified గురువారం, 21 మార్చి 2019 (16:14 IST)
ఎన్నికల వేళ మంత్రి నారా లోకేష్ అదేపనిగా నోరు జారుతున్నారు. మొన్నటికి మొన్న వైఎస్ వివేకానంద రెడ్డి మృతి చెందితే పరవశించిపోయాం అని నోరు జారిన లోకేష్ మళ్లీ మరోసారి నోరు జారారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఏప్రిల్ 9న ఓటు వేసి గెలిపించాలంటూ జారేశారు. ఎన్నికలు ఏప్రిల్ 11న అయితే నారా లోకేష్ ఏప్రిల్ 9న ఓటు వేయమని అనడంతో అది విన్నవారంతా షాకయ్యారు.

ఇక ఇదే అదనుగా వైసీపీ నాయకులు లోకేష్ నోరు జారుడుపై టార్గెట్ చేశారు. లోకేష్ చెప్పినట్లుగానే తెదేపాకి ఏప్రిల్ 9న ఓట్లు వేయండి. వైకాపాకి మాత్రం ఏప్రిల్ 11న ఓటు వేసి గెలిపించండి అంటూ నారా లోకేష్ వ్యాఖ్యల వీడియోను లింక్ చేస్తున్నారు. మొత్తమ్మీద నారా లోకేష్ పదేపదే నోరు జారుతూ బాగా దొరికిపోతున్నారు.దీనిపై మరింత చదవండి :