గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By కుమార్
Last Updated : బుధవారం, 20 మార్చి 2019 (11:45 IST)

36 ఏళ్ల చరిత్రలో మొదటిసారి ఒంటరిగా బరిలోకి టీడీపీ!

2019 సార్వత్రిక ఎన్నికలు టీడీపీకి ప్రత్యేకమైనవి. ఎందుకంటే టీడీపీ పార్టీ ఆవిర్భావం నుండి 2014 ఎన్నికల వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ టీడీపీ పొత్తులతోనే ఎన్నికల బరిలోకి దిగింది. అయితే ఈసారి మాత్రం ఎలాంటి పొత్తులూ లేకుండానే బరిలోకి దిగుతుండటం గమనార్హం. 
 
జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీల పాత్ర కోసం లేదా రాష్ట్ర అవసరాల కోసం టీడీపీ ప్రతిసారీ మిత్ర పక్షాలతో కలిసే పోటీ చేసింది. 36 ఏళ్ల టీడీపీ చరిత్రలో మొదటిసారిగా తెలుగుదేశం ఒంటరిగా పోటీ చేస్తోంది.
 
1982వ సంవత్సరంలో పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత 1983లో జరిగిన తొలి ఎన్నికల్లో మేనకా గాంధీకి చెందిన సంజయ్ విచార్ మంచ్ అనే పార్టీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగి ఘన విజయం సాధించింది. ఇందిరా గాంధీ హత్యానంతరం 1984లో జరిగిన ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు కొట్టుకుపోగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. 
 
ఆ ఎన్నికల్లో బీజేపీకి దేశవ్యాప్తంగా రెండే సీట్లు లభిస్తే అందులో ఒకటి టీడీపీ కూటమి భాగస్వామిగా హన్మకొండ నుండి దక్కింది. ఆ తర్వాత లోక్‌సభలో టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఆ తర్వాత 1989, 1994, 2004, 2014 ఎన్నికల్లోలో బీజేపీతో 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్‌తో పోటీ చేసింది.