శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By కుమార్
Last Updated : మంగళవారం, 19 మార్చి 2019 (19:44 IST)

మొదటిసారి చంద్రబాబుపై డైరెక్ట్ అటాక్ చేసిన పీకే

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా పని చేస్తున్న ప్రశాంత్ కిషోర్ మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి సోషల్ మీడియాలో కామెంట్లు చేసాడు. నిన్న జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు కేసీఆర్‌ను, జగన్‌ను, ప్రశాంత్ కిషోర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. తనపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న పీకే దానిపై సోషల్ మీడియాలో స్పందించారు. 
 
నిన్న బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కేసీఆర్ క్రిమినల్ పాలిటిక్స్ చేస్తున్నారు. మరోవైపు బీహార్ దోపిడీదారు ప్రశాంత్ కిషోర్ ఏపీలో లక్షలాది ఓట్లు తొలగించే కుట్రకు తెరతీసాడు అని విమర్శించారు. దీనికి సమాధానంగా ఓటమి కళ్లముందు కనిపిస్తుంటే చంద్రబాబు లాంటివారు కూడా అడ్డగోలుగా మాట్లాడటంతో వింత ఏమీ లేదన్నారు. బీహార్‌పై ప్రమాదకరమైన, పక్షపాత విమర్శలు చేసే ముందు ఏపీ ప్రజలు మీకు ఓటు ఎందుకు వేయాలో చెప్పమంటూ ట్వీట్ చేసారు.