450 రోజులుగా చికెన్ రైస్ మాత్రమే.. ఇంకోటి ముట్టుకోలేదంటే.. ఒట్టు..?
సాధారణంగా మనకు నచ్చిన వంటకం అంటే రోజూ ఒక పూట తింటాం. లేదంటే మాసానికో, వారానికో రెండుసార్లు తీసుకుంటాం. అందుకని మిగిలిన వంటకాలను పక్కనబెట్టేసి.. నచ్చిన వంటకాన్ని అదేపనిగా తింటూ కూర్చోం. కానీ ఓ వ్యక్తి మాత్రం ఒకరోజు కాదు.. రెండురోజులు కాదు.. ఏకంగా 450 రోజులు ఒకే డిష్ అదేనండి.. ఒకటే వంటకం తింటున్నాడు.. ఓ వ్యక్తి. వేరొక వంటకాన్ని అస్సలు ముట్టుకోలేదు.
తనకు నచ్చిన వంటకాన్ని ఏకంగా 15 నెలలుగా తింటూ గడిపిన వ్యక్తి గురించి తెలుసుకుందాం. రోజూ చికెన్ రైస్‌ను మాత్రమే తీసుకుంటూ 15 నెలలు గడిపేశాడు ఓ సింగపూర్ వ్యక్తి. చికెన్ రైస్ అంటే ఆ వ్యక్తికి చాలా ఇష్టమని.. అందుకే రోజూ డైట్‌లో అదే వుంటుందట. అంతేకాకుండా తాను తీసుకుంటూ వచ్చిన చికెన్ రైస్‌ను ఫోటో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఆ ఫోటో వైరల్ అవుతోంది.
ఇంకేముంది.. చికెన్ రైస్‌ను మాత్రమే రోజూ తినే వ్యక్తికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు. అలాగే ఆతన్ని ఫాలో చేస్తూ.. లైక్స్, షేర్లు ఇచ్చేవారి సంఖ్య కూడా బాగా పెరిగిపోతోంది.