సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 19 మార్చి 2019 (11:16 IST)

పెళ్లికి నో చెప్పింది.. మరో యువకుడితో నిశ్చితార్థం.. కత్తెరతో దాడి..

పెళ్లికి నిరాకరించిందని ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను కాదని వేరొక వ్యక్తితో వివాహానికి సిద్ధమైందనే అక్కసుతో.. నిశ్చితార్థం చేసుకుందన్న కోపంతో ఓ ప్రేమోన్మాది దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళితే.. యూసుఫ్‌గూడలోని జవహర్‌నగర్‌కు చెందిన ఓ యువతి పదో తరగతి వరకు చదివి ఇంట్లోనే ఉంటోంది. యువతి ఇంటి కింద వున్న టైలర్ షాపులో శ్రీకాకుళం జిల్లాకు చెందిన వై.దుర్గాప్రసాద్ (25) పనికి చేరాడు. 
 
అదే బిల్డింగ్‌లో ఉంటున్న యువతిపై అతడి దృష్టి పడడంతో ఆమె బయటకు వెళ్లినప్పుడల్లా అనుసరించేవాడు. ఆమెను ప్రేమించాల్సిందిగా వేధించేవాడు. కానీ అందుకు ఆమె నిరాకరించింది. పెళ్లికి చేసుకోమని ఒత్తిడి చేశాడు. అయితే సదరు యువతికి ఈ నెల 2న మరో యువకుడితో నిశ్చితార్థం జరిగింది. విషయం తెలిసిన దుర్గాప్రసాద్ జీర్ణించుకోలేకపోయాడు. 
 
ఆదివారం నేరుగా ఆమె ఇంటికి వెళ్లి గొడపడ్డాడు. ఆపై వెంట తెచ్చుకున్న కత్తెరతో దాడి చేశాడు. దీంతో యువతి చెవి, గొంతుకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుర్గాప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన యువతిని ఆస్పత్రికి తరలించారు.