మీ ప్రేమను వ్యక్తపరచడం ఎలా..?

Last Updated: సోమవారం, 18 మార్చి 2019 (15:33 IST)
ప్రేమలో పడ్డామని గొప్పగా చెప్పుకోగానే సరిపోదు. ఆ ప్రేమను పది కాలాలపాటు కాపాడుకునేందుకు కూడా ప్రయత్నించగలగాలి. అప్పుడే మిమ్మల్ని ప్రేమిస్తున్న మీ ప్రియురాలికి మీరంటే చెప్పలేనంత ఆకర్షణ, ఆత్మీయత ఏర్పడుతుంది. అలాంటి ఆకర్షణ, ఆత్మీయత ఒక్కసారి కలిగిందంటే చాలు మీ ప్రేమను ఎవ్వరు విడదీయలేరు.

అందుకే ప్రేమించడంతో పాటు ఆ ప్రేమను కాపాడుకోవడానికి కూడా ప్రేమికులు తప్పక ప్రయత్నించాలి. ప్రేమను కాపాడుకోవాలంటే ఏం చేయాలి అనే సందేహం మీకు కలగొచ్చు. ప్రేమను కాపాడుకోవడానికి పెద్ద పెద్ద సాహసాలేం చేయాల్సిన పనిలేదు. మీ ప్రేయసికి ఇష్టమైన విషయాలను తెలుసుకోవడం, ఆమె అభిరుచులు, ఆమె కుటుంబ వివరాలు తెలుసుకోవడం వంటివి చేయాలి.

అందుకు అనుగుణంగా ఆమె మూడ్‌ను, ఆమె ఇష్టా ఇష్టాలను తెలుసుకుని అందుకు అనుగుణంగా ప్రవర్తించగలగాలి. అలా మీరు ప్రవర్తించగల్గితే మీమీద మీ ప్రేయసికి ఎక్కడలేని ఉప్పొంగుతుంది. చాలామంది అబ్బాయిలు తమ ప్రేమను అమ్మాయి ఒప్పుకుందంటే చాలు.. ఇక తమ గురించి వారి వద్ద లేనిపోని గొప్పలు చెప్పేస్తుంటారు.దీనిపై మరింత చదవండి :