శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By
Last Updated : సోమవారం, 18 మార్చి 2019 (12:40 IST)

అదొక్కటి జరిగితే.. తప్పకుండా పెళ్లి చేసుకుంటా.. ఇక ఆగనంతే: త్రిష

స్టార్ హీరోయిన్ త్రిష సినిమాలకు వచ్చి 17 సంవత్సరాలు గడిచింది. దక్షిణాది భాషల్లో నటించిన త్రిష హీరోయిన్‌గా మంచి గుర్తింపును సంపాదించిపెట్టుకుంది. సినీ ఇండస్ట్రీలోకి ఎంతమంది కొత్త హీరోయిన్లు వచ్చినా.. త్రిషకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు. ఆమె ఖాతాలో హిట్ సినిమాలు వచ్చి పడుతూనే వున్నాయి. అయితే త్రిష పెళ్లి గురించి ప్రస్తుతం చర్చ సాగుతోంది. 
 
గతంలో త్రిష ఎంగేజ్‌మెంట్‌వరకు వచ్చింది. ఆపై పెళ్లి ఆగిపోయింది. ఈ నేపథ్యంలో బాహుబలి భల్లాలదేవుడు రానాతో త్రిష లవ్‌లో వుందని టాక్ వచ్చింది. ఇవన్నీ వుత్తుత్తివేనని.. తామిద్దరం మంచి స్నేహితులమని త్రిష, రానా చెప్పుకొచ్చారు. కానీ ఏ సినీ ఫంక్షన్‌కైనా వీరిద్దరూ జంటలో హాజరయ్యారు. రానాతో స్నేహం వల్లే త్రిష పెళ్లి కూడా క్యాన్సిల్ అయినట్లు జోరుగా ప్రచారం సాగింది. 
 
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో త్రిష మాట్లాడుతూ.. తన పెళ్లి గురించి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను సింగిల్ అని.. ఎవ్వరినీ ప్రేమించలేదని తెలిపింది. అయితే తనకు తగినవాడు తారసపడితే మాత్రం వివాహం చేసుకునేందుకు సిద్ధంగా వున్నానని త్రిష వెల్లడించింది.