శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వాసు
Last Updated : సోమవారం, 18 మార్చి 2019 (11:53 IST)

హిజ్రాను పెళ్లాడిన చెన్నై యువకుడు

జిహ్వకో రుచి... పుర్రెకో బుద్ధి అన్నచందంగా రోజురోజుకీ జనాల వింత పోకడలు కుటుంబ సభ్యులకు కన్నీళ్లు మిగుల్చుతున్నాయి. ఇప్పటి వరకు అమ్మాయిలు ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకోవడం చూస్తున్నప్పటికీ... హిజ్రాని పెళ్లి చేసుకొని తల్లిదండ్రులను వదిలేసిన 22 ఏళ్ల అబ్బాయి వివరాలు తెలియాలంటే తమిళనాడు రాష్ట్ర చెన్నైలోని తండయార్‌పేటకి వెళ్లాల్సిందే.
 
వివరాలలోకి వెళ్తే... తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగరంలోని తండయార్‌పేటలో బీఎస్సీ చదివిన తమిళరసన్‌ (22) అదే ప్రాంతానికి చెందిన ఒక హిజ్రాను వివాహం చేసుకున్నాడు. తమ కుమారుడిని సదరు హిజ్రా బారి నుంచి విడిపించాలంటూ తల్లిదండ్రులు పోలీసులకు మొరపెట్టుకున్నప్పటికీ ఫలితం కనిపించలేదు. 
 
తండయార్‌పేటకు చెందిన తమిళరసన్‌ ఆ ప్రాంతానికి చెందిన శివశ్రీ అనే హిజ్రాను వివాహం చేసుకొని తిరిగి ఇంటికి వెళ్లలేదు. సమాచారం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు ఇంటికి రమ్మని పిలిచినా రాలేదు. దీంతో వారు వాషర్‌‌మెన్‌పేట పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు తమిళరసన్‌ను విచారించినప్పటికీ తాను హిజ్రాతోనే ఉంటానని చెప్పడంతో కుటుంబసభ్యులు విలపిస్తూ... వెనుతిరగవలసి వచ్చింది.