బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వాసు
Last Updated : బుధవారం, 13 మార్చి 2019 (13:44 IST)

రాహుల్ రాకపై ఆ అమ్మాయి పోస్ట్ చేసిన వీడియో వైరల్.. నెటిజన్లు ఏమంటున్నారంటే

కాంగ్రెస్ పార్టీ తమ అధికారిక ఖాతాలో రాహుల్ గురించి పోస్ట్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. దీనిపై పలు రకాల కమెంట్స్ వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ చెన్నైలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా బుధవారం విద్యార్థులను కలిసారు. అయితే ఈ సమావేశం జరగడానికి ముందు వనక్కం రాహుల్ గాంధీ హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్‌లో పలు వీడియోలు పోస్ట్ అయ్యాయి. అందులో ఒక అమ్మాయి పోస్ట్ చేసిన వీడియోను తమ అధికారిక సైట్‌లో కాంగ్రెస్ పోస్ట్ చేసింది.
 
రాహుల్ రాక కోసం ఎదురుచూస్తున్న ఓ విద్యార్థిని తెగ ఎగ్జైట్ అవుతూ.. అతని రాక కోసం వెయిట్ చేయలేకపోతున్నామని పెట్టిన వీడియో ప్రస్తుతం చర్చనీయాంశమైంది. దీనిపై ట్రోలింగ్ మొదలుపెట్టేసిన నెటిజన్లు.. రాహుల్ ప్రసంగం స్టాండప్ కామెడీ ప్రోగ్రామ్‌ను మించిపోయేలా ఉంటుందని, ఆయన కామెడీ కోసం ఎవరైనా ఎదురుచూస్తారని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.