సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వాసు
Last Updated : మంగళవారం, 12 మార్చి 2019 (14:16 IST)

అక్కకు చేశాకే నీకు పెళ్లి... మనస్తాపంతో చెల్లి ఏం చేసిందో తెలుసా?

అక్క కంటే ముందుగా పెళ్లి చేయని చెప్పడంతో కన్న తండ్రిపై కోపగించుకున్న డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చిన్నలింగపూర్‌ గ్రామంలో సోమవారం జరిగింది.
 
వివరాలలోకి వెళ్తే... చిన్నలింగపూర్‌ గ్రామానికి చెందిన చేప్యాల కనకయ్య-కనకవ్వ దంపతుల మూడవ కుమార్తె చేప్యాల రేణుక (20) సిద్దిపేట జిల్లా కేంద్రంలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది. ఆదివారం రాత్రి తల్లిదండ్రులు కూతుళ్ల పెళ్లిళ్ల విషయం గురించి చర్చిస్తూండగా రేణుక తనకూ పెళ్లి చేయాలని తల్లి దండ్రులను కోరింది.
 
అయితే తల్లిదండ్రులు పెద్ద కుతురు వివాహం చేయక ముందే నీ వివాహం ఎలా చేస్తామని మందలించడంతో మనస్థాపం చెందిన యువతి సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పు పెట్టుకుని ఆత్మహత్య చేసుకుంది. 
 
మంటలు చేలరేగడంతో చుట్టు పక్కల వాళ్లు అక్కడికి చేరుకునే సరికి రేణుక పూర్తిగా కాలిపోయి మృతి చెందిన్నట్లు తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.