గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 6 మార్చి 2019 (18:10 IST)

అల్లు అర్జున్.. స్నేహారెడ్డి వైవాహిక జీవితానికి ఎనిమిది ఏళ్లు..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. స్నేహారెడ్డిని ప్రేమ వివాహం చేసుకుని.. ఎనిమిది సంవత్సరాలయ్యాయి. ఈ సందర్భంగా పెళ్లి ముహూర్తపు ఫోటోను అభిమానులతో పంచుకున్నారు అల్లు అర్జున్. తాను ప్రేమించిన స్నేహారెడ్డిని తన జీవిత భాగస్వామిని చేసుకోవడంలో బన్నీ సక్సెస్ అయ్యారు. వీరి వివాహం మార్చి 6, 2011లో జరిగింది. 
 
అల్లు అర్జున్, స్నేహారెడ్డి దంపతులకు 2014లో అయాన్, 2016లో అర్హ ఇద్దరు సంతానం వున్నారు. షూటింగ్‌లు లేని సమయంలో అల్లు అర్జున్ ఎక్కువ సమయంలో ఫ్యామిలీతో గడిపేందుకే ఇష్టపడతాడు. 
 
ఇక సినిమాల సంగతికి వస్తే.. నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా ఫ్లాఫ్ కావడంతో కొంత గ్యాప్ తీసుకున్న బన్నీ త్వరలోనే త్రివిక్రమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్‌లో సెట్స్ మీదకు వెళ్లబోతోంది. అలాగే మార్చి 6న అల్లు అర్జున్, స్నేహారెడ్డిల పెళ్లి రోజు కావడంతో ఫ్యాన్స్, నెటిజన్లు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.