సైరాలో స్టైలీష్ స్టార్.. నిజమేనా...?
మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం సైరా. ఈ చిత్రానికి స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతానికి ఈ షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో శరవేగంగా జరుగుతుంది.
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పైన రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చిరు సరసన నయనతార నటిస్తుంది. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చ సుదీప్ ఈ సినిమాలో నటిస్తుండటంతో సైరాపై స్కై లెవల్లో అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే... ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏంటంటే.. ఈ సినిమాలో చిరుతో పాటు మరో మెగా హీరో కూడా కనిపించనున్నారని. ఆ హీరో ఎవరో కాదు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయం మాత్రం ఇంకా అఫిషియల్‌గా ఎనౌన్స్ చేయలేదు. మరి... ఇది నిజమో కాదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.