గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి
Last Updated : శుక్రవారం, 15 మార్చి 2019 (11:08 IST)

నేను తమన్నాను పెళ్లిచేసుకుంటా: శృతి హాసన్

నాకే కనుక అవకాశం ఉంటే తమన్నాను తప్పకుండా పెళ్లాడుతానంటోంది శృతి హాసన్. సౌత్ సినీ ఇండస్ట్రీలో తమన్నా, శృతిహాసన్ మధ్య మంచి స్నేహం ఉందనే సంగతి అందరికీ తెలిసిందే. అవకాశం వచ్చినప్పుడల్లా ఒకరిమీద ఒకరు ప్రశంసలు కురిపించుకుంటారు. తాజాగా జరిగిన ఓ సంఘటన వీరిద్దరి మధ్య స్నేహబంధాన్ని మరోసారి జ్ఞప్తికి తెచ్చింది. ఓ చిట్‌చాట్ షోకి అతిథిగా వచ్చిన శృతి హాసన్‌ను ఉద్దేశించి హాస్ట్ ఇలా ప్రశ్నించాడు.. ఒకవేళ మీరు అబ్బాయి అయితే ఏ హీరోయిన్‌తో డేట్‌కు వెళ్తారని అడిగాడు.
 
శృతి దానికి సమాధానమిస్తూ.. తమన్నా అంటే తనకు చాలా ఇష్టం అని, ఒకవేళ తాను అబ్బాయినైతే.. తప్పకుండా తమన్నాను పెళ్లి చేసుకునేదాన్ని అని చెప్పింది. తను చాలా మంచి అమ్మాయి. తనను అసలు వదిలిపెట్టే దానిని కాదు అని సమాధానమిచ్చింది.
 
బాలీవుడ్‌లో అడుగుపెట్టడం వల్ల తనకు నష్టం జరిగిందని శృతి వాపోయారు. ఇదే విషయమై ఆమె మాట్లాడుతూ.. తన మొదటి సినిమా గురించి తీసుకున్న నిర్ణయం సరైంది కాదు అని, అప్పటికి తాను సినిమాల్లో నటించేందుకు సిద్ధంగా ఉండలేదు అంది. దీంతో పాటు ఇండస్ట్రీ గురించి కూడా పూర్తిగా తెలియదని, బాలీవుడ్ చిత్రంతో ఎంట్రీ ఇవ్వడం కూడా సరైన నిర్ణయం కాదు అని శృతి హాసన్ పేర్కొన్నారు.