సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 13 మార్చి 2019 (10:51 IST)

అమ్మో.. ఇదేంటి? వరుడు మెడలో వధువు తాళి కట్టింది..?

ఆధునికత పేరుతో వింత పోకడలు వెలుగులోకి వచ్చేస్తున్నాయి. వివాహం అంటే వధువు మెడలో వరుడు మంగళసూత్రం కట్టడం చేస్తుండటం విని వుంటారు. కానీ కర్ణాటకలోని విజయపుర జిల్లాలో వరుడు మెడలో వధువు తాళి కట్టింది. వివరాల్లోకి వెళితే.. విజయపుర జిల్లా ముద్దేబిహాళ్ సమీపంలోని నాలతవాడ అనే గ్రామంలో సోమవారం రెండు పెళ్లిళ్లు జరిగాయి. 
 
రెండింటా వధువులే తాళిని తీసుకుని వరుడి మెడలో కట్టారు. ఇదే అసలు సిసలైన బసవణ్ణ సిద్ధాంతమని.. 12వ శతాబ్ధ కాలంలో ఈ పద్ధతి వుండేదని వధూవరుల కుటుంబీకులు వెల్లడించారు. ఈ వివాహానికి పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక వేత్తలు, బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. ఈ వివాహానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.