నడిరోడ్డులో నృత్యం చేసిన శ్రియ

Last Updated: ఆదివారం, 17 మార్చి 2019 (16:16 IST)
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లలో శ్రియా శరణ్ ఒకరు. గత రెండు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతోంది. తన కెరీర్‌లో స్టార్ హీరోల అంద‌రి స‌ర‌స‌న న‌టించి మెప్పించింది. 2002లో 'సంతోషం' సినిమాతో తొలి స‌క్సెస్ అందుకుంది.

ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు వ‌యస్సు 36 ఏళ్ళు కాగా, ఇక ఆఫ‌ర్లు రావ‌డమే క‌ష్ట‌మ‌న్నారు. కానీ అంద‌రి అంచ‌నాలు మించేలా హీరోయిన్ పాత్ర‌ల‌తో పాటు కీల‌కమైన రోల్స్ చేస్తుంది. న‌టించిన 'న‌ర‌కాసురుడు' చిత్రం విడుద‌ల కావ‌ల‌సి ఉండ‌గా, త‌మిళంలో న‌ర‌గ‌సూర‌న్ అనే టైటిల్‌తో ఈ చిత్రం రిలీజ్‌కి సిద్దంగా ఉంది.

చివ‌రిగా శ్రియ న‌టించిన 'న‌క్ష‌త్రం', 'పైసావ‌సూల్'‌, 'గాయ‌త్రి', 'వీర‌భోగ వ‌సంత‌రాయ‌లు' వంటి చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టాయి. 'ఎన్టీఆర్ క‌థానాయకుడు' చిత్రంలో 'కామియో' రోల్ పోషించిన‌, పెద్ద‌గా ఫ‌లితం లేక‌పోయింది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డి కిట్టిలో ప‌లు ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

అయితే తాజాగా ఈ అమ్మ‌డు న‌డిరోడ్డుపై నృత్యం చేసిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. విదేశాల‌లో ప్ర‌స్తుతం కార్నివ‌ల్ ఫెస్టివ‌ల్ జ‌రుగుతుండ‌గా, ఆ కార్య‌క్ర‌మంలో భాగంగా శ్రియ స్టెప్పులేసింది. ప్ర‌స్తుతం శ్రియ డ్యాన్స్ వీడియో వైర‌ల్ అయింది.దీనిపై మరింత చదవండి :