గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 11 మార్చి 2019 (10:50 IST)

సినిమా హాలులో జాతీయ గీతమా..? ఇదేంటండి బాబూ.. అవసరమా?: పవన్ కల్యాణ్

సినిమా హాలులో జాతీయగీతం ప్లే చేస్తే లేచి నిల్చునే సంస్కృతిపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మండిపడ్డారు. సినిమా హాళ్లలో జాతీయగీతం వస్తుంటే లేచి నిలబడడం తనకు నచ్చని విషయం అని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పేశారు. 
 
జాతీయ గీతాన్ని సినిమా హాళ్లలోనే ఎందుకు ప్లే చేయాలని ప్రశ్నించారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా ఎంజాయ్ చేయడానికి ఉపయోగపడే సినిమా థియేటర్లు కాస్తా ఇప్పుడు దేశభక్తి నిరూపించుకునేందుకు వేదికలుగా మారాయని విమర్శించారు. 
 
ఇంకా రాజకీయ నాయకులు తన సభలకు ముందు జాతీయ గీతాన్ని ప్లే చేయొచ్చుగా అంటూ అడిగారు. అంతటితో ఆగకుడా కార్యాలయాల్లో కూడా జనగణమన పాడేలా చూడాలన్నారు. ఇతరులకు నీతులు చెప్పేవారు ముందుగా దానిని వారే అమలు చేసి అందరికీ మార్గదర్శకంగా నిలవాలని హితవు పలికారు. కాగా 2016, డిసెంబరులో జాతీయ గీతాన్ని.. జనసేన చీఫ్ పవన్ అవమానించారంటూ... హైదరాబాదుకు చెందిన న్యాయవాది ఆయనపై కేసు పెట్టిన సంగతి తెలిసిందే.