శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : శనివారం, 23 ఫిబ్రవరి 2019 (16:15 IST)

5వేల రెస్టారెంట్లను జాబితా నుంచి తొలగించిన జొమాటో

ప్రముఖ ఆన్‌లైన్ డెలివరీ సంస్థ జొమాటో దాదాపు ఐదువేల రెస్టారెంట్లను తమ జాబితా నుంచి తొలగించినట్లు వెల్లడించింది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలను అందుకోలేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు వెల్లడించింది. దేశంలోని 150 పట్టణాల్లో తమతో ఒప్పందం చేసుకున్న సంస్థల్లో నాణ్యతా ప్రమాణాలను తనిఖీ చేస్తామని తెలిపింది. 
 
ప్రతిరోజూ తమ జాబితాలోకి కొత్తగా 400 రెస్టారెంట్లు వచ్చి చేరుతున్నాయి. అయితే రెస్టారెంట్ల నాణ్యతా ప్రమాణాలను పరిశీలించడం చాలా కీలకమని.. ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నిబంధనలను పూర్తిగా అమలు చేస్తామని జొమాటో తెలిపింది. 
 
తమతో అనుబంధం ఉన్న దాదాపు 80వేల రెస్టారెంట్లను మరోసారి పరిశీలించాలనుకుంటున్నామని జొమాటో వెల్లడించింది. ఈ క్రమంలో ఆ రెస్టారెంట్లు నాణ్యతా ప్రమాణాలను అందుకునేందుకు సాయం చేస్తామని తెలిపారు.