సంబంధిత వార్తలు
- సామాన్యుల యుద్ధం... పాకిస్థాన్ ముర్దాబాద్... నినాదాలు
- చర్చల ద్వారా పరిష్కారమా? ఐతే మూడు పెళ్ళిళ్లు ఎందుకు చేసుకున్నారు..?
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలు పక్కనబెట్టండి : ఉపరాష్ట్రపతి
- నిన్న (పాకిస్థానీలకి) క్విట్ ఇండియా... నేడు (కాశ్మీరీలకి) సహాయనిరాకరణ
- పెరుగుతున్న సెక్స్ ప్రెగ్నెన్సీ టూరిజం.. అక్కడకు క్యూ కడుతున్న మహిళలు
హోండా నుండి త్వరలో మరో స్పోర్ట్స్ బైక్ విడుదల
ప్రముఖ మోటర్‌సైకిల్ బ్రాండ్ హోండా నుండి త్వరలో మరో స్పోర్ట్స్ బైక్ విడుదల కానుంది. సీబీఆర్ 650ఆర్ పేరుతో మరో స్పోర్ట్స్ బైక్‌ని తీసుకురానుంది. ఈ బైక్‌కి సంబంధించి హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) ముందస్తు బుకింగ్‌లను విడుదల చేసింది. దీని ధర రూ.8 లక్షలలోపు ఉండే అవకాశం ఉంది. మిలాన్‌లో జరిగిన 2018 ఈఐసీఎంఏ షోలో ఈ బైక్‌ని ఆవిష్కరించారు.
2019లో విడుదల చేయనున్న మోడళ్లను ఈఐసీఎంఏ షోలో ప్రదర్శించారు. భారత్‌లో ఇప్పుడు సీబీఆర్ 650ఆర్ బుకింగ్‌లు ప్రారంభిస్తున్నట్లు హెచ్‌ఎంఎస్‌ఐ సీనియర్ ఉపాధ్యక్షుడు (అమ్మకాలు, మార్కెటింగ్) యద్వింధర్ సింగ్ గులేరియా పేర్కొన్నారు. సీబీఆర్ 650ఎఫ్ స్థానాన్ని ఇది భర్తీ చేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ సరికొత్త సీబీఆర్ 650ఆర్ బైకులో 649సీసీ లిక్విడ్ కూల్డ్ ఫోర్-సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు.
యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ని కలిగి ఉంటుంది. పాత మోడళ్లతో పోల్చితే ఛాసిస్ బరువు 6 కేజీలు తక్కువని కంపెనీ తెలిపింది. 22 నగరాల్లో కొత్త సీబీఆర్ 650ఆర్ బైక్‌ని అందుబాటులోకి తీసుకురానున్నారు. రూ.15,000 చెల్లించి ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చని హోండా సంస్థ వెల్లడించింది.
