శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సందీప్
Last Updated : గురువారం, 21 ఫిబ్రవరి 2019 (12:17 IST)

అన్నదాతల కష్టాలను పిండుకుంటున్న సైబర్ నేరగాళ్లు

సైబర్ నేరగాళ్ల దురాగతాలు మిన్నంటిపోతున్నాయి. ప్రజల సొమ్మును అక్రమంగా పిండుకోవడమే కాక, అన్నదాతల కష్టాన్ని కూడా స్వాహా చేస్తున్నారు. ఓ రైతు ఖాతాలో నుండి ఏకంగా రూ. 4.34 లక్షలు కాజేసారు. వారి వ్యూహాలు మనకు తెలియకపోవడంతో సులభంగా మోసం చేస్తున్నారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. 
 
పూడూరు మండలం రేగడిమామిడిపల్లికి చెందిన కేశన్నగారి అమృతారెడ్డి కొద్ది రోజుల క్రితం పత్తి పంటను విక్రయించాడు. అలా అర్జించిన లాభాన్ని రెండు రోజుల క్రితం రూ. 4.34 లక్షలు ఖాతాలో జమచేసారు. మంగళవారం అతని ఖాతా నుండి డబ్బు విత్‌డ్రా చేసినట్లు మొబైల్‌కి సందేశాలు రావడంతో అప్రమత్తం అయ్యాడు. వెంటనే తన వ్యక్తిగత ఖాతా ఉన్న చన్‌గోముల్‌ ఎస్బీఐ అధికారులను సంప్రదించాడు. 
 
బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను పరిశీలించిన సిబ్బంది. అతని ఖాతాలో నుండి డబ్బు ఏటియం, అమెజాన్, ఓలా క్యాబ్‌లకు చేరిందని చెప్పారు. రైతు వ్యక్తిగత వివరాలను తెలుసుకుని సైబర్ నేరగాళ్లు ఈ చర్యకు పాల్పడినట్లు బ్యాంక్ అధికారులు అనుమానిస్తున్నారు. దాంతో ఆవేదన చెందిన రైతు పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయమని కోరుతున్నాడు.