అక్కడ అరటి ఆకులకు భలే డిమాండ్.. ఎక్కడ?
తమిళనాడులో జనవరి ఒకటో తేదీ నుంచి కొన్ని ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం విధించడం జరిగింది. ముఖ్యంగా హోటళ్లలో ఇది వరకు ప్లాస్టిక్ పేపర్లలో ఆహార పదార్థాలను ప్యాక్ చేస్తుండే వారు. ప్రస్తుతం ప్లాస్టిక్‌ను తమిళనాడులోని అన్నాడీఎంకే సర్కార్ బ్యాన్ చేయడంతో.. ప్రస్తుతం హోటళ్లలో అరటి ఆకులతో ఆహార పదార్థాలను ప్యాకింగ్ చేస్తున్నారు. దీంతో అరటి ఆకులకు భలే డిమాండ్ పెరిగింది.
తమిళనాడులోనే అరటి ఆకుల ఉత్పత్తి అధికంగా వుంటుంది. కోవై జిల్లా, మేట్టుపాలయంలో అరటి వ్యవసాయం ప్రధానంగా జరుగుతోంది. దాదాపు ఐదువేల ఎకరాల్లో అరటి చెట్ల సాగుబడి జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్‌ను బ్యాన్ చేయడంతో వ్యాపారులు గ్రామాలకు వెళ్లి రోజుకు అరటి ఆకులు కావాలని రిజర్వేషన్ చేసుకుంటున్నారు. దీంతో అరటి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వీటితో పాటు చెట్ల గుజ్జుతో చేసే వస్తువులు, పేపర్ వస్తువులు, పసుపు సంచులకు కూడా తమిళనాడులో గిరాకీ పెరిగింది. తమిళ సర్కారు ప్లాస్టిక్ నిషేధం ఉత్తర్వుతో వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించిందని టాక్ వస్తోంది.