కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలు పక్కనబెట్టండి : ఉపరాష్ట్రపతి
తిరుపతి విమానాశ్రయంలో 177 కోట్ల రూపాయలతో ఎయిర్ పోర్ట్ విస్తరణ - బలోపేతం పనులను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలు పక్కనబెట్టి అభివృద్ధిలో భాగస్వామ్యంలో కావాలని పిలుపునిచ్చారు. ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు రావాలంటే సంస్కరణలు అవసరమన్నారు. ప్రపంచంలోనే మూడవ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఆవిష్కరించబోతోందన్నారు.
తిరుపతి అభివృద్థి వేగంగా జరుగుతుండడం సంతోషంగా ఉందని, తిరుపతి విమానాశ్రయంలో రన్ వే పనులు త్వరగా పనులు పూర్తయి అంతర్జాతీయ రాకపోకలు సాగాలని ఆకాంక్షించారు. స్వచ్ఛభారత్ కు ప్రజలు సహకరించాలని కోరారు. తిరుపతిలో రైల్వేస్టేషన్ లో ఆధునిక వసతులను రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తానని చెప్పారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి జయంత్ సిన్హా మాట్లాడుతూ ఎయిర్ పోర్ట్ విస్తరణ పనులు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రపంచంలోనే ప్రసిద్థి చెందిన ఆధ్మాత్మిక క్షేత్రం తిరుపతని, అతి తక్కువ సమయంలోనే అంతర్జాతీయ విమాన రాకపోకలు సాగనున్నాయని చెప్పారు. పెరుగుతున్న ప్రయాణీకుల దృష్ట్యా తిరుపతి విమానాశ్రయంలో అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు.