ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (16:00 IST)

ఆ రెండు తప్పులే.. టీమిండియా ఓటమికి కారణం.. విరాట్ కోహ్లీ

కివీస్‌తో హామిల్టన్‌లో జరిగిన మూడో టీ-20లో భారత జట్టు ఓడిపోయేందుకు గల కారణాలేంటో.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. తొలి టీ-20లో భారత్ టాస్ గెలిచింది. ఇంకా కివీస్‌ను బ్యాటింగ్ చేయమని ఆహ్వానించింది. దీంతో కివీస్ 219 పరుగులు సాధించింది. ఇదే తరహాలో చివరి టీ-20లో కివీస్ బ్యాటింగ్ చేయడం ద్వారా భారత్ మ్యాచ్‌ను కోల్పోయిందని కోహ్లీ అన్నాడు. 
 
టాస్ గెలిచి కివీస్‌ను బ్యాటింగ్ చేయమనడం తప్పుడు నిర్ణయమని తాను భావిస్తున్నట్లు కోహ్లీ చెప్పుకొచ్చాడు. కుల్దీప్ మినహా.. మిగిలిన భారత బౌలర్లందరూ.. ఓవర్‌కు పది పరుగులు ఇచ్చారని టీమిండియా ప్రస్తుత సారథి కోహ్లీ వ్యాఖ్యానించాడు. వీరిలో ఎవరైనా ఒక్కరు అద్భుతంగా బౌలింగ్ చేసి.. పరుగులు ఇవ్వకుండా వుంటే భారత్ గెలిచేదని కోహ్లీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. 
 
ఇంకా ఆరంభంలో వికెట్ల నేలకూలకుండా చేసివుంటే టీ-20 సిరీస్ భారత్ కైవసం చేసుకునేదని కోహ్లీ తెలిపాడు. అయినప్పటికీ భారత బ్యాట్స్‌మెన్లలో ఆరుగురు బ్యాట్స్‌మెన్లు మెరుగ్గా ఆడారు. చివరకి వరకు కృనాల్ పాండ్యా, దినేష్ కార్తీక్ జట్టును గెలిపించేందుకు సాయశక్తులా కృషి చేశారు. 
 
అయితే చివరి ఓవర్ మాత్రం కాస్త తడబడకుండా పరుగులు రాబట్టి వుంటే భారత్ గెలుపును నమోదు చేసుకుని వుంటుందని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్ ఓటమికి భారత బౌలింగ్ లైనే కారణమన్నాడు.