ఆస్ట్రేలియా వేదికగా ట్వంటీ20 వరల్డ్ కప్.. భారత్ - పాక్ మ్యాచ్ లేనట్టేనా?

twenty20
Last Updated: మంగళవారం, 29 జనవరి 2019 (17:09 IST)
ఆస్ట్రేలియా వేదికగా వచ్చే యేడాది ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీలు జరుగనున్నాయి. ముందుగా మహిళల వరల్డ్ కప్ టోర్నీ ఫిబ్రవరి 21వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అక్టోబరు నెల 18వ తేదీ నుంచి పురుషుల ప్రపంచ కప్ టోర్నీ స్టార్ట్ అవుతుంది. ఈ టోర్నీలో చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్‌ క్రికెట్ జట్లు రెండు వేర్వేరు గ్రూపుల్లో ఉన్నాయి. ఈ రెండు టోర్నీలకు కలిపి మొత్తం 45 మ్యాచ్‌లు జరుగుతాయి. మహిళా టోర్నీలో 23 మ్యాచ్‌లు, పురుషుల టోర్నీలో 45 మ్యాచ్‌లు జరుగుతాయి.

మహిళల జట్టులో రెండు గ్రూపులు ఉండగా, గ్రూపు-ఏలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, భారత్, శ్రీలంక, క్వాలిఫయర్ 1. గ్రూపు-బిలో ఇంగ్లండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా, పాకిస్థాన్, క్వాలిఫయర్ 2. ఈ విభాగంలో ఫిబ్రవరి 21వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు స్టేజ్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. అలాగే, సెమీ ఫైనల్ మార్చి 5, ఫైనల్ మార్చి 8వ తేదీన జరుగుతాయి.

ఇక పురుషుల జట్టులో క్వాలిఫయర్ మ్యాచ్‌లు అక్టోబరు 18 నుంచి 23వ తేదీ వరకు జరుగుతాయి. గ్రూపు స్టేజ్‌లో అక్టోబరు 24 నుంచి నవంబరు 8వ తేదీ వరకు జరుగుతాయి. గ్రూపు-ఏలో పాకిస్థాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్‌తో పాటు.. రెండు క్వాలిఫయర్ జట్లు ఉంటాయి. గ్రూపు-బిలో భారత్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్‌ జట్లతో పాటు రెండు క్వాలిఫయర్ జట్లు ఉంటాయి. ఈ విభాగంలో సెమీ ఫైనల్ మ్యాచ్‌లు నవంబరు 11, 22 తేదీల్లో, ఫైనల్స్ మ్యాచ్ నవంబరు 15వ తేదీన జరుగుతుంది.దీనిపై మరింత చదవండి :