ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By మోహన్
Last Updated : శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (17:58 IST)

యమహా ఎంటీ-09 బైక్ వచ్చేస్తోంది

యమహా మోటర్ వెహికల్ సంస్థ భారతీయ మార్కెట్‌లోకి సరికొత్త ఎంటీ-09 బైక్‌ని గురువారం విడుదల చేసింది. ఈ మోడల్ ధర రూ.10.55 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌, ఢిల్లీ). పాత మోడల్‌తో పోల్చితే దీని ధర రూ.16,000 ఎక్కువగా ఉంది. యమహా కంపెనీ ఈ బైక్ కోసం బుకింగ్స్‌ను ప్రారంభించింది. త్వరలోనే డెలివరీ మొదలుపెట్టనున్నట్లు కంపెనీ తెలిపింది. 
 
847 సీసీ లిక్విడ్‌ కూల్డ్‌ ఇన్‌లైన్‌ త్రీ సిలిండర్‌ ఇంజన్‌‌ని కలిగిన ఈ బైక్‌లో 6 స్పీడ్‌ గేర్‌బాక్స్‌, ట్విన్‌పాడ్‌ ఎల్‌ఈడీ లాంప్స్ వంటి సదుపాయాలను అమర్చారు. బైక్ డిజైన్ మాత్రం ఇంతకు ముందు ఉన్నట్లుగానే ఉంటుందని, అయితే సరికొత్త రంగుల్లో ఇది లభిస్తుందని కంపెనీ తెలిపింది. బైక్ బరువు సుమారు 193 కిలోలు ఉండగా, ఇంధన ట్యాంక్ సామర్థ్యం 14 లీటర్లు ఉండడం గమనార్హం.