గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 20 నవంబరు 2018 (10:52 IST)

మహిళలు నిలబడే మూత్ర విసర్జన చేయొచ్చు...

చాలా మంది మహిళలు కూర్చొని మూత్ర విసర్జన చేసేందుకు ఇబ్బందిపడతారు. ఇలాంటి వారి కోసం ఢిల్లీ ఐఐటీకి చెందిన విద్యార్థినులు ఓ పరికరాన్ని ఆవిష్కరించారు. ఇది గర్భిణిలు, దివ్యాంగులు, ఇతర సమస్యలతో బాధపడుతున్న వారికి ఎంతో సౌలభ్యంగా ఉండనుంది. 
 
సాధారణంగా మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకున్నవారు, గర్భిణిలు, దివ్యాంగులతో పాటు ఇతర సమస్యలతో బాధపడే మహిళలకు ఉపశమనం కలిగించేలా కొందరు ఐఐటీ విద్యార్థినులు ఈ కొత్త పరికరాన్ని తయారు చేశారు. ఈ పరికరం సాయంతో మహిళలు నిలబడే మూత్రవిసర్జన చేయొచ్చు. ఈ పరికరానికి 'శాన్ఫి' అనే పేరు పెట్టారు. 
 
కేవలం 10 రూపాయల ఖరీదు చేసే ఈ పరికరాన్ని ఇప్పటికే ఢిల్లీలోని ఎయిమ్స్ పరీక్షించింది. వరల్డ్ టాయిలెట్‌ డే సందర్భంగా సోమవారం దీన్ని విడుదల చేశారు. పైగా, మట్టిలో త్వరగా కలిసిపోయేలా తయారు చేసిన ఈ పరికరాలను దేశవ్యాప్తంగా లక్ష వరకు పెంచారు.