బుధవారం, 8 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. వ్యక్తిత్వ వికాసం
Written By Kowsalya
Last Updated : సోమవారం, 20 ఆగస్టు 2018 (15:45 IST)

పిల్లలు తల్లిదండ్రులతో ఎలా మసలుకోవాలంటే?

మిత్రులతో మాట్లాడడంలో ఏముంది ఎవరైనా మాట్లాడుతారు. అదేవిధంగా తలిదండ్రులతో కూడా మాట్లాడాలి. మరీ బాల్యంలో కాకపోయినా ఓ పన్నెండు, పదమూడేళ్లు వచ్చాకయినా ఆ దిశగా వెళ్లాలి. లేదంటే ఎప్పటికీ భయం భయంగ దూరదూరంగా

మిత్రులతో మాట్లాడడంలో ఏముంది ఎవరైనా మాట్లాడుతారు. అదేవిధంగా తలిదండ్రులతో కూడా మాట్లాడాలి. మరీ బాల్యంలో కాకపోయినా ఓ పన్నెండు, పదమూడేళ్లు వచ్చాకయినా ఆ దిశగా వెళ్లాలి. లేదంటే ఎప్పటికీ భయంభయంగా దూరదూరంగా ఉండాల్సి వస్తుంది. పెద్దవాళ్లంటే ప్రేమ, భయం, గౌరవం ఉండాలి. పెద్దవాళ్లతో పిల్లలు తాముగా మాట్లాడేది ఏమీ వుండకపోవచ్చు.
 
కానీ, వాళ్లు చెబుతున్నప్పుడు శ్రద్ధగా వినగలితే చాలు ఏవో కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. తమ పిల్లలతో పరమ గంభీరంగా ఉండే తలిదండ్రులు కూడా వేరే వాళ్ల పిల్లలతో చాలా చనువుగా, ఆత్మీయంగా ఉంటారు. ఈ విషయం తెలియక తమ పిల్లలతో సీరియస్‌గా ఉండేవాళ్లు మిగతా పిల్లలతో కూడా అంతే సీరియస్‌గా ఉంటారని పొరబడుతుంటారు.
 
ఎప్పుడో ఒకసారి వాళ్లతో మాట్లాడితే గానీ అసలు విషయం తెలిసి రాదు. కొంతమంది తల్లిదండ్రులకు కొన్ని ముఖ్యమైన విషయాలను నేరుగా తమ పిల్లలతో చెప్పడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్లలో కొందరు పరోక్షంగా వాళ్ల మిత్రులతో చెప్పించే ప్రయత్నం చేస్తారు. ఈ వైఖరి దాదాపు తల్లిదండ్రులు అందరిలోనూ ఉంటుంది. పిల్లలు పెద్దవాళ్లతో చనువుగా ఉండడం వలన మిత్రులు ఇరువురికీ కలిగే ఒక అదనపు సౌకర్యమిది.
 
కానీ, వీరి వ్యాఖ్యాలకు వాళ్ల వ్యక్తిత్వానికి ఎక్కడా పొంతన ఉండదు. పిల్లలకు ఇదే పెద్ద అనుభవం. ఇలాంటివన్నీ సమాజంలో ఒకే వ్యక్తి మీద రెండు పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యాలు, అభిప్రాయాలు ఎలా ఉంటాయో పిల్లలకు బాల్యంలోనే తెలియచెబుతాయి. దీనివలన మునుముందు సమాజంలో ఎలా మసలుకోవాలో, ఒక వ్యక్తికి సంబంధించిన నిజానిజాల విషయంలో ఎలా ఒక అభిప్రాయానికి రావాలో ఎంతో కొంత బోధపడుతుంది.