బుధవారం, 8 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By Kowsalya
Last Updated : సోమవారం, 20 ఆగస్టు 2018 (14:23 IST)

ఫ్లవర్ వాజ్‌లో పువ్వులు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే?

ఫ్లవర్ వాజ్‌లో పువ్వులు అలంకరించాలంటే సూర్యోదయానికి ముందే కొయ్యాలి. ఎండ తగలకూడదు. వీటని కోసేటప్పుడు పదునైన చాకును ఉపయోగించాలి. నీటితో కడిగి ఫ్లవర్ వాజ్‌లో పువ్వులను అలంకరించాలి. పువ్వులతో పాటు మధ్యమధ్యలో ఆకులు కూడా పెట్టాలి. ఆకులు నీళ్ళలో మునగకూడదు.

ఫ్లవర్ వాజ్‌లో పువ్వులు అలంకరించాలంటే సూర్యోదయానికి ముందే కొయ్యాలి. ఎండ తగలకూడదు. వీటని కోసేటప్పుడు పదునైన చాకును ఉపయోగించాలి. నీటితో కడిగి ఫ్లవర్ వాజ్‌లో పువ్వులను అలంకరించాలి. పువ్వులతో పాటు మధ్యమధ్యలో ఆకులు కూడా పెట్టాలి. ఆకులు నీళ్ళలో మునగకూడదు. అదే పూల ఆకులు కాకుండా వేరు ఆకులతో అలంకరిస్తే ఫ్లవర్ వాజ్ అందంగా ఉంటుంది.
 
ముదురు రంగు పువ్వులు మధ్యలో ఉంచి, అరవిరిసిన పువ్వులు చుట్టూరా పెట్టుకోవాలి. ఇలా చేస్తే అవి కూడా విచ్చుకుంటాయి. ఫ్లవర్ వాజ్ లోపల, బయట శుభ్రంగా కడిగి అందులో నీరు నింపాలి. నీళ్ళల్లో కాస్తంత ఉప్పు కలుపుకోవాలి. ఇలా చేస్తే పువ్వులు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఫ్లవర్ వాజ్ ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నచోట పెట్టకుండా తాజా గాలి వచ్చే చోట పెట్టుకోవాలి.
 
మెుక్కలు మనకు ఆక్సిజన్ ప్రసాదించి, మనం వదిలిన కార్బన్ డై ఆక్సైడ్ తీసుకుని మనకు ఎంతో మేలు చేస్తాయి. తద్వారా మనకి మంచి ఆరోగ్యకరమైన వాతావరణం లభిస్తుంది. వేప, యూకలిప్టస్ మెుదలైనవి క్రిమి సంహారిణిగా ఉపయోగపడుతాయి. కనున స్థలం ఉన్నవారు బద్దకించకుండా మెుక్కలు పెంచడం ఆరోగ్యానికి మంచిది. మెుక్కలకు నీరు పోయడం కూడా వ్యాయామమవుతుంది.