కలలో పువ్వుల తోట కనిపిస్తే... ఏ జరుగుతుందో తెలుసా?
కలలనేవి సహజంగా అందరి వస్తుంటాయి. వాటి గురించి చాలామంది పట్టించుకోరు. కానీ మరికొందరు మాత్రం కల దేనిని సూచిస్తూ వచ్చిందోననే భయంతో తీవ్రంగా ఆలోచిస్తుంటారు. ఆ కల ఎలాంటి ఫలితాలను ఇస్తుందోననే భయంతో ఆందోళన చ
కలలనేవి సహజంగా అందరి వస్తుంటాయి. వాటి గురించి చాలామంది పట్టించుకోరు. కానీ మరికొందరు మాత్రం కల దేనిని సూచిస్తూ వచ్చిందోననే భయంతో తీవ్రంగా ఆలోచిస్తుంటారు. ఆ కల ఎలాంటి ఫలితాలను ఇస్తుందోననే భయంతో ఆందోళన చెందుతుంటారు. ప్రతి కలకి కాకపోయినా కొన్ని సమయాల్లో వచ్చే కలలలో ఫలితం ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంధాలలో చెప్పబడుతోంది.
ఒక్కోసారి పువ్వులతోలు, పండ్ల తోటలు తిరుగుతున్నట్లుగా కలలు వస్తుంటాయి. మరోసారి ఆకాశంలో ఎగురుతున్నట్లుగా, పాములు - తేళ్ల మధ్యలో ఉన్నట్లుగా కలలు వస్తుంటాయి. ఇలాంటి కలలకు శాస్త్రంలో ఫలితాలు చెప్పబడుతున్నాయి. కలలో పువ్వులు గాని, పండ్లు గాని కనిపిస్తే శుభకార్యాలలో, దైవకార్యలలో పాలుపంచుకునే అవకాశం లభిస్తుంది. సంతానలేమి వారికి సంతానం కలగడం వంటి కోరికలు నెరవేరుతాయి.
పాలు, తేనె వంటివి కలలో కనిపిస్తే సేవించినట్టు అనిపించడం వలన అంతా మంచే జరుగుతుంది. ఒకవేళ ఇవి ఒలికిపోయినట్లుగా కలవస్తే మాత్రం తలపెట్టిన కార్యాలలో నిరాశలు ఎదురవుతుంటాయి. అంతేకాకుండా పాలు తేనే కలలో కనిపిస్తే ఎంత మంచి జరుగుతుందో, నూనె కనిపిస్తే అంత కీడు జరుగుతుంది. గాల్లో ఎగురుతున్నట్లుగా కలవస్తే మరణ వార్త వినవలసి వస్తుంది.
పాములు - తేళ్లు ఉన్నచోటుకు వెళుతున్నట్లుగా కలవస్తే కోరి శత్రుత్వాన్ని కొని తెచ్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వీటిని చంపినట్లుగా కలవస్తే త్వరలోనే శత్రువులు నశిస్తారని ఆధ్యాత్మిక గ్రంధాలలో చెప్పబడుతోంది. అయితే కాలంకాని కాలంలో ఇవి కనిపించడం వలన అసంతృప్తిని కలిగించే సంఘటనలు ఎదురవుతాయి.