గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 27 జులై 2018 (13:23 IST)

శనిదేవునికి ఏ పువ్వులతో పూజించాలో తెలుసా?

జీవితం కష్టనష్టాలను మానసికంగాను, శారీరకంగాను వాటిని ఎదుర్కునే విధంగా చేయడంలో శనిదేవుడు ప్రధానమైన పాత్రను పోషిస్తుంటాడు. ఇలాంటి బాధలను తట్టుకోవడం అంతతేలికైన విషయం కాదు. అందువలనే ఎంతటివారైనా శనిదేవుని పేరు వినడానికి కూడా భయపడుతుంటారు. అయితే ఆయన మాత్రం

జీవితం కష్టనష్టాలను మానసికంగాను, శారీరకంగాను వాటిని ఎదుర్కునే విధంగా చేయడంలో శనిదేవుడు ప్రధానమైన పాత్రను పోషిస్తుంటాడు. ఇలాంటి బాధలను తట్టుకోవడం అంతతేలికైన విషయం కాదు. అందువలనే ఎంతటివారైనా శనిదేవుని పేరు వినడానికి కూడా భయపడుతుంటారు. అయితే ఆయన మాత్రం తాను అనుకున్న పనిని పూర్తిచేసుకుంటుంటాడు.
 
తన అనుగ్రహాన్ని ఆశించిన వారిపై నుండి తన ప్రభావాన్ని తగ్గిస్తూ వెళుతాడు. శనిదోషం బారిన పడినవాళ్లు ఆయనను శాంతింపజేసి ఆయన అనుగ్రహాన్ని పొందడం మినహా మరోమార్గం లేదు. శని దోషాల నుండి బయటపడి పూర్వస్థితికి చేరుకోవాలంటే అది శనిదేవునిని కరుణాకటాక్షాలతోనే సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలో శని అనుగ్రహాన్ని పొందే వివిధ మార్గాలలో పువ్వులు కూడా ప్రధానమైన పాత్రను పోషిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలలో చెప్పబడుతోంది.  
 
శనిదేవునికి నీలం రంగు, నలుపు రంగు పువ్వులు ప్రీతికరమైనవిగా చెప్పబడుతోంది. శనిత్రయోదశి రోజున ఈ పువ్వులతో పూజించడం వలన ఆయన ప్రసన్నుడవుతాడట. ఎప్పుడైతే ఆయన అనుగ్రహిస్తాడో అప్పుడే శనిదోష నివారణ జరిగిపోతుంది. రకరకాల సమస్యల నుండి విముక్తి చెందవచ్చును.