1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By Kowsalya
Last Updated: మంగళవారం, 24 జులై 2018 (15:18 IST)

హనుమంతుడి అనుగ్రహం... భక్తులు కోరికలు నెరవేర్చుటలో...

హనుమంతుడు సున్నితమైన మనస్సు గలవాడు. తన స్వామి శ్రీరామచంద్రుడిని ఎంతగా ఆరాధిస్తాడో, తన భక్తులను కాపాడడంలో కూడా అంతే స్పందిస్తాడు. అందుకే పిల్లలు నుండి పెద్దలు వరకు హనుమంతుడిని పూజించని వారుండరు. అంకితభావంతో అర్చిస్తుంటారు.

హనుమంతుడికి ప్రదక్షణలు, పూజలు చేస్తూ అప్పాలను నైవేద్యంగా పెడితే హనుమంతుడు ప్రీతి చెందుతాడని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా రామాయణం చదవడం, సుందరకాండ పారాయణం చేయడం వలన కూడా హనుమంతుడు ప్రీతి చెందుతాడని చెప్పబడుతోంది. ఇలా హనుమంతుడు ప్రీతి చెందినచో ఆయన అనుగ్రహం లభిస్తుంది.
 
హనుమంతుడి అనుగ్రహం వలన గ్రహ పీడలు, వ్యాధులు, బాధలు, భయాలు తొలగిపోతాయని చెప్పబడుతోంది. అలానే తలపెట్టిన కార్యాలు విజయవంతంగా పూర్తిచేస్తారు.