శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎందుకు పూజిస్తారంటే?
కలియుగ దైవంగా శ్రీనివాసుడు భక్తులచే అనునిత్యం పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. శ్రీనివాసుడిని శనివారం రోజున దర్శించుకోవడానికి ఆ రోజున ఆ స్వామిని పూజించడానికి భక్తులు ఆసక్తిని చూపుతుంటారు. అందుకు కారణం శన
కలియుగ దైవంగా శ్రీనివాసుడు భక్తులచే అనునిత్యం పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. శ్రీనివాసుడిని శనివారం రోజున దర్శించుకోవడానికి ఆ రోజున ఆ స్వామిని పూజించడానికి భక్తులు ఆసక్తిని చూపుతుంటారు. అందుకు కారణం శనివారం ఆ స్వామికి ప్రీతకరమైన రోజు కావడం వలనేనని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. శనివారానికి శ్రీనివాసుడికి మధ్య విడదీయరాని అనుబంధం ఉంది.
పద్మావతీదేవిని శ్రీనివాసుడు వివాహమాడినది స్వామి వక్ష స్థలాన లక్ష్మీదేవి నిలిచినది శనివారం రోజునే. శ్రీనివాసుడు తొండమాన్ చక్రవర్తికి ఆజ్ఞను ఇచ్చిన రోజు ఆలయంలోకి స్వామి వారు ప్రవేశించిన రోజుర స్వామి వారిని భక్తులు మెుదటిసారిగా దర్శించుకున్నది శనివారం రోజునే.
శ్రీనివాసుడిని పూజించేవారికి పీడించనని ఆ స్వామికి శనిదేవుడు మాట ఇచ్చింది కూడా శనివారమే. ఇలా శనివారమనేది స్వామివారితో ఇన్ని విధాలుగా ముడిపడి ఉండడం వలనే ఆ స్వామిని భక్తులు శనివారాం రోజున ఆరాధిస్తుంటారు.