సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : శనివారం, 28 జులై 2018 (20:11 IST)

జూలై 22-07-2018 నుండి 28-07-2018 వరకు మీ వార రాశి ఫలితాలు

కర్కాటకంలో రవి, బుధ, రాహువులు, సింహంలో శుక్రుడు, తులలో బృహస్పతి, ధనస్సులో వక్రి శని, మకరంలో వక్రి కుజ, కేతువులు. తుల, వృశ్చిక, ధనస్సు, మకరంలో చంద్రుడు. 26వ తేదీ నుండి బుధుని వక్రమారంభం. 27న గురుపౌర్ణిమి, చంద్రగ్రహణం, ఉత్తరాషాడ, శ్రవణా, నక్షత్రం వారు

కర్కాటకంలో రవి, బుధ, రాహువులు, సింహంలో శుక్రుడు, తులలో బృహస్పతి, ధనస్సులో వక్రి శని, మకరంలో వక్రి కుజ, కేతువులు. తుల, వృశ్చిక, ధనస్సు, మకరంలో చంద్రుడు. 26వ తేదీ నుండి బుధుని వక్రమారంభం. 27న గురుపౌర్ణిమి, చంద్రగ్రహణం, ఉత్తరాషాడ, శ్రవణా, నక్షత్రం వారు ఈ గ్రహణాన్ని వీక్షించకుండడం శ్రేయస్కరం.
 
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
గృహంలో స్తబ్ధత తొలగుతుంది. ఆరోగ్యం సంతృప్తికరం. సంప్రదింపులు కొలిక్కి వస్తాయి. ధనలాభం ఉంది. అవసరాలు తీరుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడుతాయి. అర్థాంతంగా నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. సంతానం పై చదువుల గురించి ఆందోళన చెందుతారు. విద్యా ప్రకటనలను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మంగళ, బుధ వారాల్లో తొందరపాటుతనం వలన నష్టాలు తప్పవు. నగదు, పత్రాలు జాగ్రత్త. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. అనవసర బాధ్యతలు చేపట్టి ఇబ్బందులెదుర్కుంటారు. మీ శ్రీమతి సలహా పాటించండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాల నుండి బయటపడుతారు. వృత్తులవారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగయత్నంలో నిరుత్సాహం తగదు. కోర్టు వాయిదాలకు హోజరవుతారు. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. మెుహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. సావకాశంగా ఆలోచించండి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. బంధువులతో సంత్సబంధాలు నెలకొంటాయి. ఆందోళన తొలగి కుదుటపడుతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. చక్కని ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఖర్చులు అధికం, పొదుపు మూలక ధనం ముందుగానే తీసుకుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఆది, గురు వారాల్లో చెల్లింపుల్లో జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఉద్యోగస్తులు ఏకాగ్రత వహించండి. యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. అధికారులకు వివరణ ఇచ్చుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. సరకు నిల్వలో జాగ్రత్త. ప్రయాణం ఉల్లాసంగా సాగుతుంది.
 
మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
గృహమార్పు కలిసివస్తుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. పెట్టుబడులకు అనుకూలం కాదు. వేడుకల్లో పాల్గొంటారు. మీ రాక అయినవారికి సంతోషాన్నిస్తుంది. మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వెచ్చిస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతారయి. మంగళ, శనివారాల్లో కొంతమందిత ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. ప్రేమ వ్యవహారాలు వివాదస్పదమవుతాయి. కంప్యూటర్ రంగాలవారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు పదవీయోగం. పురస్కారాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. విద్యార్థులకు కొత్త పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కొన్ని సమస్యల నుండి బయటపడుతారు. గృహంలో స్తబ్ధత తొలగుతుంది. ఆదాయం బాగుంటుంది. ఖర్చులకు ఇబ్బంది ఉండదు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. గురు, శుక్ర వారాల్లో పనులు సాగక విసుగు చెందుతారు. సంతానానికి త్వరలో ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. సంప్రదింపులకు అనుకూలం. మీ అభిప్రాయాలను కచ్చితంగా వ్యక్తం చేయండి. ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. అవకాశాలు చేజారినా మంచిదే. పట్టుదలతో ఉద్యోగయత్నం సాగించండి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. సంస్థల స్థాపనలకు అనుకూలం.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆర్ధిక, కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి. చాకచక్యంగా వ్యవహరించాలి. కార్యసాధనకు ఓర్పు ప్రధానం. శనివారం నాడు పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఒక వ్యవహారంలో నష్టపోవలసి వస్తుంది. ధనమూలక సమస్యలు అధికం. పెట్టుబడులకు సమయం కాదు. ఆప్తుల రాక ఉపశమనం కలిగిస్తుంది. సంప్రదింపులు ఫలించవు. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. సమస్యలు, ఇబ్బందులు తాత్కాలికమే. త్వరలో సంతోషకరమైన వార్తలు వింటారు. కష్టం నిదానంగా ఫలిస్తుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. సహోద్యోగుల సాయం అందుతుంది. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాల్లో ఒడిదుకులను అధిగమిస్తారు.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఖర్చులు భారమనిపించవు. అవసరాలు నెరవేరుతాయి. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. మీ వాక్కు ఫలిస్తుంది. విలువైన వస్తువులు, నగదు జాగ్రత. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. మీ జోక్యం అనివార్యం. పనులు మెుండిగా పూర్తిచేస్తారు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. సన్నిహితులకు చక్కని సలహాలిస్తారు. శుభవార్త వింటారు. కష్టానికి ప్రతిఫలం అందుతుంది. ఆత్మీయులకు సాయం అందిస్తారు. సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి కలుగుతుంది. నిర్మాణాలు, మరమ్మత్తులు చేపడతారు. వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. పెట్టుబడులకు తరుణం కాదు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. విద్యార్థులకు పరిచయాలు సంతృప్తినిస్తాయి. సన్మాన, సాహిత్తయ సభల్లో ప్రముఖంగా పాల్గొంటారు.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. సంప్రదింపులు అనుకూలం. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కష్టానికి తగిన గుర్తింపు ఉంటుంది. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. ధనలాభం ఉంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పరిచయాలు బలపడుతాయి. పనులు హడావుడిగా సాగుతాయి. ప్రముఖుల సందర్శనం వీలుకాదు. గృహమార్పు అనివార్యం. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ముఖ్యమైన పత్రాలు, వస్తువులు జాగ్రత్త. నోటీసులు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. ఉపాధ్యాయులకు పదోన్నతి. పురస్కారాలు అందుకుంటారు. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. 
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట
కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి పొందుతారు. సంప్రదింపులు, ఒప్పందాలకు అనుకూలం. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. ఆది, సోమ వారాల్లో ఓర్పుతో వ్యవహరించండి. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. సహాయం, సలహాలు ఆశించవద్దు. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. రుణదాతల ఒత్తిడి అధికం. ఆత్మీయుల సాయం అందుతుంది. పనులు మెుండిగా పూర్తిచేస్తారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. వృత్తుల వారికి సామాన్యం.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. పట్టుదలతో వ్యవహరించండి. ఆర్థికలావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. సమయానికి డబ్బు అందక ఇబ్బందులెదుర్కుంటారు. అవసరాలు నెలవేరవు. మంగళ, బుధ వారాల్లో శ్రమాధిక్యతతో పనుల పూర్తి చేస్తారు. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. సంప్రదింపులు, ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన మంచిది. పెద్దల సలహా పాటించండి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. భాగస్వామిక చర్చలు వాయిదా పడుతాయి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. విద్యార్థులకు కొత్త పరిచయాలేర్పడుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. 
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. పదవులు, పురస్కారాలు అందుకుంటారు. కొత్త పరచయాలేర్పడుతాయి. ధనలాభం ఉంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. తొందరపడి చెల్లింపులు జరుపవద్దు. గురు, శుక్ర వారాల్లో ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పనులు సకాలంలో పూర్తికాగలవు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. పరిచయం లేని వారితో జాగ్రత్త. కాంట్రాక్టులు, ఏజెన్సీలు దక్కించుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. సరకు నిల్వలో జాగ్రత్త. ఉపాధఇ పథకాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. 
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. విద్యాప్రకటనలు, దళారులను నమ్మవద్దు. ఒక సమాచారం సందేహం కలిగిస్తుంది. ప్రతి విషయం స్వయంగా చూసుకోవాలి. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. పరిస్థితుల అనుకూలత ఉంది. ఆందోళన తొలగి కుదుటపడుతారు. పనులు చురుకుగా సాగుతాయి. ఆరోగ్యం సంతృప్తికరం. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. శనివారం నాడు చెల్లింపుల్లో జాగ్రత్త. అనవసర జోక్యం తగదు. పూర్య విద్యార్థులను కలుసుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను దీటుగా ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు.
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. వ్యవహారాలను సమర్ధంగా నిర్వహిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ధనప్రాప్తి, వాహనయోగం ఉన్నాయ. గృహం ప్రశాంతంగా ఉంటుంది. పనులు వేగవంతమవుతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆది, సోమ వారాల్లో ఊహించని సంఘటనలెదురవుతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వృత్తి ఉపాధి పథకాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. పెద్దల ఆరోగ్యం కుదుడపడుతుంది. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమిస్తారు. వాణిజ్య ఒప్పందాలకు అనుకూలం. చిరువ్యాపారులకు ఆశాజనకం. సేవ, దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.