సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : శనివారం, 21 జులై 2018 (08:41 IST)

శనివారం (21-07-2018) దినఫలాలు - ఖర్చులు అధికం...

మేషం: రచయితలకు, పత్రికా రంగంలో వారికి కీర్తి, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. అసలైన సంతృప్తితో మరిన్ని కొత్త అవకాశాల్ని సొతం చేసుకుంటారు. రాజకీయాంలో వారికి కార్యకర్తల వలన చికాకులు తప్పవు. స్త్రీలలో ఉత్సాహం ప

మేషం: రచయితలకు, పత్రికా రంగంలో వారికి కీర్తి, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. అసలైన సంతృప్తితో మరిన్ని కొత్త అవకాశాల్ని సొతం చేసుకుంటారు. రాజకీయాంలో వారికి కార్యకర్తల వలన చికాకులు తప్పవు. స్త్రీలలో ఉత్సాహం పలు ఆలోచనలు చోటు చేసుకుంటాయి. ఖర్చులు అధికం మగుటవలన ఆందోళనకు గురవుతారు.
 
వృషభం: ప్రముఖుల సహకారంతో ఒక సమస్య నుండి గట్టెక్కుతారు. భాగస్వామ్యుల మధ్య అవగాహన లోపిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు. మీ కళత్ర మెుండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. కొన్ని సమస్యలు మబ్బు విడినట్లు విడిపోవును. 
 
మిధునం: రావలసిన బాకీలు సకాలంలో అందినా ధనం ఏమాత్రం నిల్వచేయలేరు. మీ సంతానం విషయంలో ఏకాగ్రత వహించ గలుగుతారు. రేషన్ డీలర్లకు అధికారుల నుండి వేధింపులు తప్పవు. సాంఘిక కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. వాతావరణంలో మార్పు వలన స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది.  
 
కర్కాటకం: నిరుద్యోగులకు దూరప్రాంతాల నుండి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు చికాకులు తప్పనిసరిగా ఉంటాయి. మీ కోరికలు, అవసరాలు వాయిదా వేసుకుంటారు. బ్యాంకింగ్ రంగాల వారికి మెళకువ అవసరం. రవాణా రంగంలో వారికి పనివారలతో చికాకులు తప్పవు. ధనం ఎంత వస్తున్నా ఏమాత్రం నిల్వచేయలేకపోతారు. 
 
సింహం: పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి చికాకులు, ఒత్తిడి తప్పదు. బిల్డింగ్ కాంట్రాక్టర్లకు తాపి పనివారితో సమస్యలు తలెత్తుతాయి. దుబారా ఖర్చులు అధికమవుతాయి. కొబ్బరి, పండ్లు, పూలు, కూరగాయల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంద. ప్రైవేటు రంగాల్లో వారికి ఒక ప్రకటన ఎంతో ఆందోళన కలిగిస్తుంది. 
 
కన్య: తలపెట్టిన పనులలో విఘ్నాలు, చీటికి మాటికి అసహానం ఎదుర్కుంటారు. ప్రైవేటు రంగాల్లోవారికి ఒక ప్రకటన ఎంతో ఆందోళన కలిగిస్తుంది. నిరుద్యోగులకు చేతివరకు వచ్చిన అవకాశాలు చేజారిపోతాయి. ఇతరులతో అతిగా మాట్లాడడం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. ప్రేమికులకు పెద్దల వైఖరి ఎంతో ఆందోళన కలిగిస్తుంది. 
 
తుల: ఆర్థిక ఒడిదుకులు తలెత్తిన బంధువుల సహాయంతో సమసిపోగలవు. స్త్రీలు చుట్టు ప్రక్కలవారితో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. ఆత్మవిశ్వాస రెట్టింపవుతుంది. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండడం శ్రేయస్కరం. రాజకీయాలలోని వారికి ప్రయాణాలలో మెళకువ అవసరం.
 
వృశ్చికం: ఆర్థిక విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. హోటల్, తినుబండారాలు వ్యాపారులకు క్యాటరింగ్ రంగాలవారికి కలిసివస్తుంది. స్త్రీలకు కాళ్ళు, నడుము నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. రిటైర్డు ఉద్యోగస్తులు రావలసిన బెనిఫిట్స్ కోసం బాగా శ్రమించాలి. 
 
ధనస్సు: ఆర్థిక విషయాల్లో సన్నిహితుల నుండి మెుహమ్మాటం ఎదురయ్యే అవకాశం ఉంది. మీ సంతానం మెుండివైఖరి మీకు ఎంతో చికాకు, నిరుత్సాహం కలిగిస్తుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. రవాణా రంగాలవారికి ఏకాగ్రత అవసరం. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
మకరం: విద్యార్థుల మెుండి వైఖరి వలన ఉపాధ్యాయులకు చికాకులు తలెత్తుతాయి. మీ అశ్రద్ధ ఆలస్యాల వలన కొన్ని చికాకులు వంటివి ఎదుర్కుంటారు. నిరుద్యోగులకు చేతివరకు వచ్చిన అవకాశాలు చేజారిపోతాయి. ఇతరులను సహాయం అర్థించి భంగపాటుకు గురవుతారు. ముఖ్యంగా ప్రింటింగ్, మీడియాలో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. 
 
కుంభం: రావలసిన ధనం చేతికందుతుంది. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. వాతావరణంలోని మార్పు మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. వస్త్రాలు, ఆభరణాలు, విలువైన వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరిక వాయిదా పడుతుంది. 
 
మీనం: స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పంతం అధికమవుతుంది. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. పూర్వ పరిచయ వ్యక్తుల కలయిక సంతృప్తినిస్తుంది. ముఖ్యుల ఆరోగ్యం మిమ్మల్ని నిరాశపరుస్తుంది. శత్రువులు మిత్రులుగా మారుతారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి అధికమవుతుంది.