శనివారం, 9 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Kowsalya
Last Updated : శనివారం, 21 జులై 2018 (13:48 IST)

'పాలపిట్ట' శకునం మంచిదేనా?

ప్రతి ఒక్కరూ తాము తలపెట్టిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి కావాలని కోరుకుంటారు. అలా పూర్తికావాలి అంటే ఆ కార్యం నిమిత్తం బయలుదేరేటప్పుడు మంచి శకునం ఎదురుగా రావాలని ఆశిస్తుంటారు. తలపెట్టిన కార్యాన్

ప్రతి ఒక్కరూ తాము తలపెట్టిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి కావాలని కోరుకుంటారు. అలా పూర్తికావాలి అంటే ఆ కార్యం నిమిత్తం బయలుదేరేటప్పుడు మంచి శకునం ఎదురుగా రావాలని ఆశిస్తుంటారు. తలపెట్టిన కార్యాన్ని ఎదురుగా వచ్చే శకునం తప్పనిసరిగా ప్రభావితం చేస్తుందనే విశ్వాసం పూర్వాకాలం నుండి ఉంది.
 
ఈ శకునాలలో మనుష్యులు మాత్రమే కాకుండా కొన్ని జంతువులు, పక్షులు కూడా పేర్కొనబడుతున్నాయి. అలాగే కొన్ని రకాల ధ్వనులను కూడా శకునాలుగా భావిస్తుంటారు. ముత్తైదువులు నీళ్ల బిందెతో ఎదురైనా, ఆవుదూడలు ఎదురైనా, ఆలయంలో నుండి గంట మోగిన శబ్దం వినిపించినా శుభశకునాలుగా భావించాలని చెప్పబడుతోంది.
 
అలాగే పాలపిట్ట శకునం కూడా శుభసూచకంగా విశ్వసించబడుతోంది. ఏదైనా ఒక ముఖ్యమైన కార్యం నిమిత్తం ప్రయాణమైనప్పుడు ఎదురుగా పాలపిట్ట వస్తే అది శుభసూచకంగా భావించి బయలుదేరాలని స్పష్టం చేయబడుతోంది. తలపెట్టిన కార్యం ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతుంది.