వేశ్యతో సంబంధం వుంటే పాపమా? వారిని పువ్వులతో కూడా కొట్టకూడదట...

నాటి సాంఘిక వ్యవస్థలో వేశ్యలకు ప్రత్యేక స్థానం ఇవ్వబడింది. వేదాలు, తంత్రాలు వాటిని గురించి ప్రస్తావిస్తూ వున్నాయి. యువతి అయినటువంటి వేశ్య శక్తి స్వరూపిణి. దైవమును తలచుకొనుచూ మద్యం తాగినా, వేశ్యతో సంబంధం కలిగినా పాపము కాదని కొన్ని తంత్రాలలో చెప్పబడి వ

prostitute
ivr| Last Modified శుక్రవారం, 3 ఆగస్టు 2018 (21:11 IST)
నాటి సాంఘిక వ్యవస్థలో వేశ్యలకు ప్రత్యేక స్థానం ఇవ్వబడింది. వేదాలు, తంత్రాలు వాటిని గురించి ప్రస్తావిస్తూ వున్నాయి. యువతి అయినటువంటి వేశ్య శక్తి స్వరూపిణి. దైవమును తలచుకొనుచూ మద్యం తాగినా, వేశ్యతో సంబంధం కలిగినా పాపము కాదని కొన్ని తంత్రాలలో చెప్పబడి వున్నది. స్త్రీలు ఎటువంటి తప్పులు చేసినా వారిని కొట్టకూడదు. నూరు తప్పులు చేసినా, పువ్వులతోనైనా కొట్టకూడదట. 
 
ఆమెలో మంచితనాన్ని గుర్తించి, లోపములు మరిచిపోవాలి. ఆమె ఆదిశక్తి వంశములో పుట్టింది కనుక ఆమె వేశ్య అయినా, పాపి అయినా గౌరవించదగ్గదని తంత్రాలు చెపుతాయి. ఇందులో ఎంత నిజం వున్నది తెలియదు కానీ వేశ్యలు పూర్వకాలం నుంచి వున్నట్లు చరిత్ర చెపుతోంది. వారిని సమర్థిస్తూ అనేక గ్రంథాలు కూడా వ్రాయబడి వున్నాయి. 
 
శాతవాహనుల కాలములో అనేకమంది వేశ్యలుండేవారు. వారిని వేశ్యలనీ, వారాంగలని చెప్పేవారు. గాథాసప్తశతిని బట్టి ఆ కాలములో వేశ్యలకు రసికజన సమాజంలో సంపూర్ణముగా ప్రవేశమున్నట్లు తెలుస్తోంది. వాత్స్యాయన కామసూత్రములలో వారికి అపారమైన మర్యాదలీయబడ్డాయి. రాజులు సైతం వారికి అపరితమైన ధనము ఇచ్చి వారిని పోషించేవారు. వీరికి రాజసభలోనూ ప్రవేశం వుండేదంటే వారికి ఎంతటి ప్రాముఖ్యతను కట్టబెట్టేవారో అర్థమవుతుంది.దీనిపై మరింత చదవండి :