శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By కుమార్
Last Updated : గురువారం, 21 మార్చి 2019 (14:54 IST)

సమయం లేదు మిత్రమా.. రోజూ 18 గంటలు పనిచేయండి.. చంద్రబాబు

సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 18 రోజులే గడువు ఉండటంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేసాయి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా మరింత విస్తృత ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికల మిషన్‌పై ఆయన గురువారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశానికి తిరుగులేని మెజారిటీ వస్తుందని, మహిళలంతా తెలుగుదేశంవైపే ఉన్నారని పేర్కొన్నారు.
 
తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్త రోజుకు 18 గంటలపాటు పని చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికలకు ఇంకా 18 రోజులే మిగిలి ఉండటంతో కార్యకర్తలందరూ 18 రోజులపాటు కష్టపడి పనిచేసి ప్రజల్లో అపోహలను తొలగించాలని సూచించారు. 
 
ప్రతి కార్యకర్త ఒక అభ్యర్థిగా పని చేయాలని, ఇది మీకు పరీక్షా సమయం అని చెప్పారు. అంతేకాకుండా వైసీపీ అధినేతకు తెలుగుదేశానికి వస్తున్న జనాదరణ చూసి మింగుడుపడటం లేదని వ్యాఖ్యానించారు.