సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By కుమార్
Last Updated : గురువారం, 21 మార్చి 2019 (19:07 IST)

బాలయ్య మల్టీస్టారర్ - మరో హీరో ఎవరంటే...

నందమూరి బాలకృష్ణకు గత యేడాది అంతగా అచ్చిరాలేదు. తన తండ్రి జీవితం గురించి రెండు భాగాలుగా తీసిన బయోపిక్ దారుణంగా నిరాశపరిచింది. ఆంధ్రలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచార కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ఎన్నికల తర్వాత మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టనున్నాడు. బోయపాటి దర్శకత్వంలో వచ్చే సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తమిళంలో భారీ విజయం సాధించిన మల్టీస్టారర్ సినిమాలో ఆయన నటించబోతున్నారని సినీ వర్గాలలో ప్రచారం జోరుగా సాగుతోంది.
 
మాధవన్, విజయ్ సేతుపతి కాంబినేషన్‌ల వచ్చిన "విక్రమ్ వేద" 2017లో విడుదలై భారీ విజయం సాధించింది. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో మాధవన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించగా, విజయ్ సేతుపతి రౌడీగా కనిపించాడు. ఈ చిత్ర రీమేక్ హక్కులను స్వంతం చేసుకున్న టాలీవుడ్ నిర్మాత బాలకృష్ణను సంప్రదించినట్లు తెలుస్తోంది. 
 
అదేవిధంగా మరో హీరో పాత్రలో నటింపజేయడానికి రాజశేఖర్‌ను సంప్రదిస్తున్నారంట. ఇక వీరు ఓకే అనగానే ప్రాజెక్ట్ మొదలైపోతుందట. మంచి దర్శకుడు దొరికితే ఈ సినిమా తెలుగులో ఘనవిజయం సాధించే అవకాశం ఉంది. కానీ బాలయ్య ఎన్నికలు ముగిశాక, బోయపాటి సినిమా ముగించాక ఇందులో నటించాల్సి వస్తుంది. మరోవైపు రాజశేఖర్ చేస్తున్న కల్కి సినిమా కూడా పూర్తి కావాలి, కాబట్టి ఈ సినిమా పట్టాలెక్కడానికి కనీసం ఒక ఏడాది పడుతుంది.