శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By కుమార్
Last Updated : బుధవారం, 20 మార్చి 2019 (14:41 IST)

మరో భారీ మల్టీస్టారర్ చిత్రంలో రానా

హీరో రానా ఇప్పుడు జాతీయ స్థాయి నటుడు అయిపోయాడు. తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ, ఇతర భారతీయ భాషల్లో కూడా రానాకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. బాహుబలి దెబ్బతో రానాకు బాలీవుడ్‌లో చాలా మంచి ఇమేజ్ దక్కింది. బాలీవుడ్‌లో నిర్మించే భారీ సినిమాల్లో రానాకు అవకాశాలు వస్తున్నాయి. 
 
రానాకు బాలీవుడ్‌లో 'హౌస్‌ఫుల్ 4' సినిమాలో అవకాశం దక్కింది. తాజాగా అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'భుజ్ - ది ప్రైడ్ ఆఫ్ ఇండియా'లో కల్నల్‌గా నటించనున్నాడు. ఇది దేశభక్తి ప్రధానంగా సాగే సినిమా అని సమాచారం. అజయ్ దేవగన్ హీరోగా నటించే ఈ సినిమాలో రానా స్క్వాడ్రన్ లీడర్‌గా కనిపించబోతున్నాడు.

సంజయ్ దత్, సోనాక్షీ సిన్హా, పరిణీతి చోప్రా మొదలైనటువంటి భారీ తారాగణం ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు అభిషేక్ దుదానియా దర్శకత్వం వహిస్తుండగా టీ సిరీస్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కే భారీ బడ్జెట్ సినిమా 'హిరణ్య కశ్యప'లో రానా నటించనున్నాడు.